Kora Teaser : విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన ‘కోర’ టీజర్ చూశారా?

తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి ఈ కోర సినిమా టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసారు.

Vijay Sethupathi Launched Kannada Movie Kora Teaser Watch Here

Kora Teaser : సునామీ కిట్టి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కోర’. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్, రత్నమ్మ మూవీస్ బ్యానర్స్ పై డా.AB నందిని, AN బాలాజీ, P మూర్తి నిర్మాణంలో ఒరాటశ్రీ దర్శకత్వంలో ఈ కోర సినిమా తెరకెక్కుతుంది. కన్నడలో తెరకెక్కుతున్న కోర సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది. చరిష్మా, పి.మూర్తి, M.K మాత, మునిరాజు, నినాసం అశ్వత్.. పలువురు కన్నడ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు ఈ సినిమాలో.

Also Read : Pushpa 2 : బాలీవుడ్‌లో పుష్ప 2 మ‌రో రికార్డు.. 800 కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టిన తొలి చిత్రంగా !

గతంలో పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా కోర టీజర్ రిలీజ్ చేసారు. తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి ఈ కోర సినిమా టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసారు. మీరు కూడా కోర టీజర్ చూసేయండి..

ఈ సినిమా టీజర్ చూస్తుంటే.. ఒక గూడెం ప్రజలను ఇబ్బంది పెట్టే విలన్, వాళ్ళని కాపాడటానికి వచ్చిన హీరో, అలాగే అమ్మానాన్న సెంటిన్మెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ కోర సినిమా తెరకెక్కుతుంది. యాక్షన్ సీక్వెన్స్ లు ఈ సినిమాలో భారీగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.