Pushpa 2 : బాలీవుడ్‌లో పుష్ప 2 మ‌రో రికార్డు.. 800 కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టిన తొలి చిత్రంగా !

బాక్సాఫీస్ వ‌ద్ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప 2 మూవీ రికార్డులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Pushpa 2 : బాలీవుడ్‌లో పుష్ప 2 మ‌రో రికార్డు.. 800 కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టిన తొలి చిత్రంగా !

Allu Arjun movie is set to inaugurate this new box office collection club

Updated On : January 3, 2025 / 9:58 PM IST

బాక్సాఫీస్ వ‌ద్ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప 2 మూవీ రికార్డులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చిత్రం డిసెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విడుద‌లైన 28 రోజుల్లోనే ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 1799 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఇక‌ బాలీవుడ్‌లో పుష్ప2 సృష్టిస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు.

ఇప్ప‌టికే హిందీలో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన మూవీగా రికార్డుల‌కు ఎక్కింది. తాజాగా ఈ చిత్రం మ‌రో మైలురాయిని చేరుకునేందుకు అడుగు దూరంలో ఉంది. హిందీలో 800 కోట్ల‌కు అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉంది.

Game Changer : గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్ స్టోరీనా?

నాలుగో వారంలోనూ ఈ చిత్ర క‌లెక్ష‌న్లు స్ట‌డీగా ఉన్నాయి. హిందీలో నాలుగో వారంలో 57.95 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు ప్ర‌ముఖ సినీ విశ్లేష‌కుడు త‌రుణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు. నాలుగో వారంలో శుక్ర‌వారం 7 కోట్లు, శ‌నివారం 10.25 కోట్లు, ఆదివారం 12.25 కోట్లు, సోమ‌వారం 6.25 కోట్లు, మంగ‌ళ‌వారం 7 కోట్లు, బుధ‌వారం 10.50 కోట్లు, గురువారం 4.70 కోట్లు సాధించిన‌ట్లు తెలిపారు.మొత్తంగా నాలుగు వారాల్లో పుష్ప 2 మూవీ హిందీలో 798.20 కోట్ల నెట్ వ‌సూళ్ల‌ను సాధించిన‌ట్లు చెప్పారు. ఈ రోజుతో పుష్ప‌2 మూవీ హిందీలో 800 కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్ట‌డం ఖాయ‌మ‌న్నారు.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ర‌ష్మిక మంధాన క‌థానాయిక. ఫ‌హాద్ ఫాజిల్‌, సునీల్, అన‌సూయ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.