Vijay Sethupathi : సపోర్టింగ్ యాక్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈరోజు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు విజయ్ సేతుపతి. త్వరలో విజయ్ కొడుకు సూర్య సేతుపతి హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇప్పటికే నటనలో ఓనమాలు దిద్దిన సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hi Nanna Trailer : ‘హాయ్ నాన్న’ ట్రైలర్ వచ్చేసింది.. నానితో మృణాల్తో పాటు శృతిహాసన్ కూడా..
తమిళం, హిందీ, తెలుగు, మళయాళ భాషలలో అద్భుతమైన సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు విజయ్ సేతుపతి. ఆయనకు ఇద్దరు పిల్లలు సూర్య, శ్రీజ. ఇద్దరు కూడా తండ్రి నటనను పుణికి పుచ్చుకున్నారు. సూర్య ‘నానుమ్ రౌడీ’, ‘ముగిజ్’ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. అతి చిన్న వయసులోనే సూర్య సేతుపతి కూడా తండ్రి బాటలో అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే నటన, డ్యాన్స్, ఫైట్స్‌లో పూర్తి స్ధాయి శిక్షణ తీసుకున్న సూర్య హీరోగా చేయబోతున్న మొదటి సినిమాకి రంగం సిద్ధమైంది.
సూర్య సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాకు ‘ఫీనిక్స్’ అని పేరు పెట్టారు. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ సందర్భంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాని సీనియర్ స్టంట్ మాస్టర్ అరసు డైరెక్ట్ చేస్తున్నారు. అరసు ఇండియన్ 2, జవాన్ సినిమాలకు స్టంట్ మాస్టర్‌గా వర్క్ చేశారు. ఈ సినిమాకి సీఎస్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు. ఏకే బ్రేవ్‌మన్ పిక్చర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.