Hi Nanna Trailer : ‘హాయ్ నాన్న’ ట్రైలర్ వచ్చేసింది.. నానితో మృణాల్‌తో పాటు శృతిహాసన్ కూడా..

హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ అంతా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రెండు పాటలు, టీజర్ రిలీజ్ చేసి సినిమాపై మంచి క్లాసిక్ హైప్ ఇచ్చారు. తాజాగా నేడు హాయ్ నాన్న ట్రైలర్ రిలీజ్ చేశారు.

Hi Nanna Trailer : ‘హాయ్ నాన్న’ ట్రైలర్ వచ్చేసింది.. నానితో మృణాల్‌తో పాటు శృతిహాసన్ కూడా..

Nani Mrunal Thakur Hi Nanna Movie Trailer Released

Updated On : November 24, 2023 / 6:10 PM IST

Hi Nanna Trailer : న్యాచురల్ స్టార్ నాని (Nani) ‘దసరా’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తన 30వ సినిమాగా ‘హాయ్ నాన్న’(Hi Nanna)తో రాబోతున్నాడు. కొత్త దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) నటిస్తుండగా శృతిహాసన్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఇక ఈ సినిమా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో పాటు నాని, మృణాల్ మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయని ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ తో తెలిసిపోతుంది.

హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ అంతా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రెండు పాటలు, టీజర్ రిలీజ్ చేసి సినిమాపై మంచి క్లాసిక్ హైప్ ఇచ్చారు. తాజాగా నేడు హాయ్ నాన్న ట్రైలర్ రిలీజ్ చేశారు.

Also Read : Hi Nanna Song Launch Event : ‘హాయ్ నాన్న’ అమ్మాడి.. సాంగ్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు..

ట్రైలర్ లో నాని, తన కూతురు జీవితం గడిపేస్తుండగా వారి లైఫ్ లోకి మృణాల్ వచ్చినట్టు, నాని కూతురు అమ్మ గురించి ప్రతిసారి అడగడం, నాని భార్యగా శృతిహాసన్ ఏమైంది, నాని లైఫ్ లో మృణాల్ ఉంటుందా అన్నట్టు ప్రేమ, ఎమోషన్ అంశాలతో చూపించారు. దీంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.