The GOAT : ద‌ళ‌ప‌తి విజ‌య్ బ‌ర్త్‌డే ట్రీట్‌.. అదిరిపోయిన‌ ‘ది గోట్’​ యాక్షన్ గ్లింప్స్.. నో డైలాగ్స్‌.. ఓన్లీ యాక్ష‌న్‌..

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు.

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయ‌న‌ మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అందుక‌నే ఆయ‌న న‌టించిన సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌ల అవుతూ ఉంటాయి. తాజాగా విజ‌య్ న‌టిస్తున్న సినిమా ‘ది గోట్‌’. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. మీనాక్షీ చౌదరి కథానాయిక.

ఇక నేడు (జూన్ 22) ద‌ళ‌ప‌తి విజ‌య్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. ఈ వీడియో 50 సెకన్లు ఉంది. ఈ మూవీలో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. ఇద్ద‌రు విజ‌య్‌లు బైక్‌పై వెలుతుంటే విల‌న్స్ ఛేజింగ్ చేసే సీన్ అద్భుతంగా ఉంది. యువ‌న్ శంక‌ర్ రాజా అందించిన బ్యాగ్రౌండ్ స్కోరు చాలా బాగుంది. డైలాగ్స్‌ లేకుండా యాక్షన్ సన్నివేశాలనే హైలెట్ చేస్తూ సాగిన ఈ గ్లింప్స్ వైర‌ల్‌గా మారింది. విజ‌య్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో ద‌ర్శ‌కుడి టేకింగ్ ఉందంటూ మురిసిపోతున్నారు.

ప్రభాస్ ‘కల్కి’ సినిమా రిలీజ్ ట్రైలర్ చూశారా? అదిరిపోయిందంతే..

ది గోట్ మూవీని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ నిర్మిస్తోంది. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ సెప్టెంబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది

ట్రెండింగ్ వార్తలు