Vijay Varma Tamannaah : బాలీవుడ్(Bollywood) లో నయా కపుల్ తమన్నా, విజయ్ వర్మ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ప్రమోషన్ల దగ్గరనుంచి ప్రీమియర్స్ వరకూ అన్నీ కలిసి అటెండ్ అవుతున్నారు. వీలైన ప్రతి చోటా తాము ప్రేమలో ఉన్నామంటూ తెగ చెప్పుకుంటున్నారు. అయితే నిజంగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారా? జస్ట్ పబ్లిసిటీ స్టంటా అని కొంతమందికి డౌట్ వచ్చి ఏకంగా విజయ్ వర్మని అడిగేశారు.
ఎందుకంటే 15 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో తమన్నాకి ఇప్పటి వరకూ ఎవరితోనూ రూమర్స్ లేవు. ఏ స్టార్ తోనూ మీడియాకి చిక్కిన న్యూస్ కూడా లేదు. ఇన్నేళ్లుగా సింగిల్ స్టేటస్ మెయింటెన్ చేస్తున్న తమన్నా సడెన్ గా ప్రేమలో పడటం అదికూడా లస్ట్ స్టోరీస్ 2 టైమ్ లోనే పడడంతో రకరకాల అనుమానలొచ్చాయి. విజయ్ కూడా ఆల్మోస్ట్ అంతే ఇన్నాళ్లు ప్రేమ గురించి మాట్లాడని విజయ్ లస్ట్ స్టోరీస్ నుంచే తమన్నాతో ప్రేమ అని చెప్పాడు. ఇక తమన్నా ఇన్నేళ్ల నుంచి నో కిస్సింగ్ పాలసీ చెరిపేసి విజయ్ కి లస్ట్ స్టోరీస్ లో ముద్దుల వర్షం కురించింది.
అందుకే పబ్లిసిటీ స్టంటేనా ఇదంతా అని విజయ్ ని అడిగితే.. అలాంటిదేం లేదు, అదంతా అబద్ధం. నేను తమన్నాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాను. తనని పిచ్చిగా ప్రేమిస్తున్నాను అంటూ సమాధానం చెప్పాడు. విజయ్, తమన్నా గత సంవత్సరం డిసెంబర్ 31నుంచి హైలైట్ అవుతున్నారు. కలిసి పార్టీలకి, ప్రీమియర్లకి అటెండ్ అవతున్నారు. కొన్నాళ్లు అబ్బే అదేం లేదని తప్పించుకున్నా అఖరికి తమన్నా ఓపెన్ అయ్యింది. అవును మేమిద్దరం ఇష్టపడ్డాం అంటూ క్లారిటీ ఇచ్చింది. లస్ట్ స్టోరీస్ 2 సెట్స్ లోనే విజయ్ తో ప్రేమలో పడినట్టు చెప్పేసింది. తన అందమైన ప్రపంచాన్ని విజయ్ ఇంకా అందంగా చేస్తున్నాడని, అందుకే అంతగా క్లోజ్ అయ్యానని పబ్లిక్ గానే చెప్పింది. ఇక విజయ్ కూడా ఇప్పటి వరకూ వేసిన విలన్ వేషాల్ని పక్కనపెట్టి ఇప్పుడిప్పుడే రొమాంటిక్ ఫేజ్ లోకి వచ్చానని, తమన్నాతో పిచ్చి ప్రేమలో ఉన్నానని క్లారిటీ ఇచ్చేశారు.