Vijayashanthi : సీనియర్ ఎన్టీఆర్‌ని, కళ్యాణ్ రామ్‌ని పోలుస్తూ విజయశాంతి ట్వీట్.. వైరల్

నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలో విజయశాంతి(Vijayashanthi) ముఖ్య పాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. తాజాగా విజయశాంతి ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ సీనియర్ ఎన్టీఆర్ ని, కళ్యాణ్ రామ్ ని పోలుస్తూ ఓ ట్వీట్ చేయగా అది వైరల్ గా మారింది.

Vijayashanthi Tweet on Nandamuri Kalyan Ram and Sr NTR

Vijayashanthi : ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి ఎప్పుడో సినిమాలు మానేసి రాజకీయాల్లో బిజీ అయిపొయింది. కానీ ఇటీవల మహేష్ బాబు(Mahesh Babu) సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) 21వ సినిమాలోనూ నటించబోతుంది. ఇటీవలే NKR21 సినిమా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది.

‘అశోక క్రియేషన్స్’, ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్స్ పై NKR21 సినిమాని నిర్మిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించనుంది. ఇక ఈ సినిమాలో విజయశాంతి(Vijayashanthi) ముఖ్య పాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. తాజాగా విజయశాంతి ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ సీనియర్ ఎన్టీఆర్ ని, కళ్యాణ్ రామ్ ని పోలుస్తూ ఓ ట్వీట్ చేయగా అది వైరల్ గా మారింది.

Also Read : Brahmastra Movie : బ్రహ్మాస్త్ర 2 ఎప్పుడు? క్లారిటీ ఇచ్చిన రణబీర్.. అబ్బో చాలా టైం ఉందిగా..

విజయశాంతి సీనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. ఆనాడు లెజెండ్ ఎన్టీఆర్ గారు 30 సంవత్సరాల ముందు ఒక సినిమా ప్రారంభం నాడు నాకు ఇచ్చిన గౌరవం, అట్లే ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమా ముహూర్తం రోజు నాకు ఇచ్చిన గౌరవం.. ఎప్పుడూ కూడా కళాకారిణిగా నాకు ప్రోత్సాహం, ప్రేరణ కల్పించే సందర్భాలే.. అని పోస్ట్ చేసింది. దీంతో పలువురు నందమూరి అభిమానులు సంతోషిస్తూ ఈ ట్వీట్ ని ఇంకా వైరల్ చేస్తున్నారు.