యాడ్స్ ఇచ్చే వివిధ కంపెనీలకు చెంపపెట్టులాంటిది ఈ తీర్పు. తమ కంపెనీ వస్తువులను ఉపయోగించండి.. మార్పు మీరే చూస్తారు. లావుగా ఉన్నారా.. అయితే వీటిని వాడండి సన్నబడుతారు. ఇలాంటి ఎన్నో ప్రకటనలు ప్రసారమవుతూ ఉంటాయి. వీటికి అట్రాక్షన్ అయి జనాలు కొంటుంటారు. ఓ యాడ్‌పై విజయవాడ వినియోగదారుల ఫోరమ్ సంచలన తీర్పును వెలువరించింది.
నటీమణులు రంభ, రాశిలు kolors అనే సంస్థ ఓ ప్రకటన ఇస్తోంది. ఈ యాడ్‌ని చూసి మోసపోయానంటూ సత్యవతి అనే మహిళ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. వినియోగదారుల ఫోరమ్ కోర్టు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. సినీ తారలతో kolors సంస్థ ఇస్తున్న ప్రకటలను నిలిపివేయాలని ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కలర్స్ సంస్థకు రూ. 2 లక్షల జరిమానా విధించింది. బాధితురాలు చెల్లించిన రూ. 74 వేల 652 మొత్తాన్ని 9 శాతం వడ్డీతో చెల్లించాలంటూ తీర్పును వెలువరించింది. ప్రజాదరణ కలిగిన నటీనటులు తప్పుడు ప్రకటనలు ప్రోత్సాహించడం సరికాదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ తీర్పుతో ఇతర కంపెనీల యాజమాన్యాలు మేల్కొంటాయా ? లేదా ? అనేది చూడాలి.
రంభ, రాశిలు kolors సంస్థ ప్రాడెక్ట్ ను ప్రమోట్ చేస్తున్నారు. వీళ్లిద్దరూ నటించిన ఆ వాణిజ్య ప్రకటనలు కూడా నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. ఇలాంటి తప్పుడు ప్రకటనల్లో సెలబ్రిటీలు నటించకూడదని.. అప్రమత్తంగా ఉండాలని కోర్టు సూచించింది.
Read Also: సినీ పుత్రుడు : కోడి రామకృష్ణ మృతిపై పలువురు సంతాపం
Read Also: షారుక్ కు డాక్టరేట్ ఇచ్చేందుకు నిరాకరించిన కేంద్రం