Neethone Nenu : నీతోనే నేను మూవీ రివ్యూ.. థ్రిల్లింగ్ సబ్జెక్టుతో టీచర్ల గురించి గొప్పగా..

పిల్లల్ని బాగా పైకి తీసుకురావాలి, వారికి సపోర్ట్ చేయాలి అనే ఒక టీచర్ జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైతే ఏం జరిగింది అనే నేపథ్యంలో సినిమాని తెరకెక్కించారు.

Vikas Vasishta Kushitha Kallapu Neethone Nenu Movie Review and Rating

Neethone Nenu Review : సినిమా బండి’ ఫేమ్ వికాష్ వ‌శిష్ట(Vikas Vasishta) హీరోగా సోషల్ మీడియా ఫేమ్ కుషిత క‌ళ్ల‌పు(Kushitha Kallapu), మోక్ష హీరోయిన్లుగా శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అంజిరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘నీతోనే నేను’. ఈ సినిమాని నేడు అక్టోబ‌ర్ 13న థియేటర్స్ లో రిలీజ్ అయింది.

కథ విషయానికి వస్తే.. రామ్(వికాస్ వసిష్ఠ) ఒక గవర్నమెంట్ టీచర్. తన పిల్లలని వృద్ధిలోకి తీసుకురావాలనే తపనతో పాటు స్కూల్, పిల్లలు బాగుండాలనుకుంటాడు. అతన్ని చూసి కొంతమంది టీచర్లు కుల్లుకుంటే కొంతమంది అభినందిస్తారు. అతని మంచితనం చూసి PT టీచర్ గా చేసే ఆయేషా(కుషిత) అతన్ని ఇష్టపడుతుంది. ఇదే విషయం రామ్ కి చెప్పగా అతను తనకి పెళ్లి అయిందని, చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నట్టు తన గతం చెప్తాడు. దీంతో అయేషా నిరాశపడుతుంది. ఒక రోజు రామ్, అతని భార్య సీతలను పలకరించడానికి అయేషా వాళ్ళింటికి వెళ్తే అక్కడ లేని భార్యని ఊహించుకొని, ఆమెకు ఏమైందో అని కంగారుపడుతూ రామ్ కనిపించడంతో ఆయేషా షాక్ తింటుంది. ఆ షాక్ లోనే ప్రేక్షకులకు విరామం ఇచ్చారు. సెకండ్ హాఫ్ లో అసలు రామ్ కి పెళ్లి అయిందా? అసలు సీత ఉందా? సీతకి అయేషాకి సంబంధం ఏంటి? రామ్ విద్యార్థుల కోసం ఏం చేశాడు? అయేషా ప్రేమ ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. పిల్లల్ని బాగా పైకి తీసుకురావాలి, వారికి సపోర్ట్ చేయాలి అనే ఒక టీచర్ జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైతే ఏం జరిగింది అనే నేపథ్యంలో సినిమాని తెరకెక్కించారు. గవర్నమెంట్ టీచర్లు – గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే స్టూడెంట్స్, వాళ్ళ బాధల్ని చూపిస్తూనే ఒక కమర్షియల్ పంథాలో కొన్ని థ్రిల్లింగ్ అంశాలు జత చేసి దర్శకుడు ఆసక్తిగా తెరకెక్కించాడు. ఇంటర్వెల్ నుంచి ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లతో సినిమా ఆసక్తిగా సాగుతుంది. కాకపోతే ప్రథమార్థం కాస్త సాగినట్టు అనిపిస్తుంది. అక్కర్లేకపోయినా హీరో హీరోయిన్స్ మధ్య కమర్షియాలిటీ కోసం ఒక సాంగ్ పెట్టినట్టు అనిపిస్తుంది.

ఆర్టిస్టుల విషయానికి వస్తే.. నటుడు వికాస్ వసిష్ఠ గవర్నమెంట్ టీచర్ పాత్రలో, భార్య కోసం పరితపించే పాత్రలో బాగా నటించాడు. యూట్యూబర్ కుషిత హీరోయిన్ గా ఇదే మొదటి సినిమా కావడంతో ఇంకా బాగా నటన మీద దృష్టి సారించాలని తెలిసిపోతుంది. నటుడు ఆకెళ్ళ కన్నింగ్ టీచర్ గా బాగా నటించాడు. హీరో భార్య పాత్రలో మోక్ష అనే అమ్మాయి కూడా ఎమోషనల్ గా మెప్పించింది. మోక్ష చిన్నప్పటి పాత్ర చేసిన పాప కూడా నటనతో మెప్పించింది.

టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ బాగుంది. టీచర్ – పిల్లల కథ కావడంతో స్కూల్స్, దానికి తగ్గట్టు ఉండే కథా ప్రాంగణాలన్నీ కరెక్ట్ గా చూసుకొని నిర్మాణ విలువలు బాగానే పెట్టినట్టు తెలుస్తుంది. పాటలు వినడానికి బాగున్నా ఆ బీట్స్ అన్ని కూడా గతంలో ఎక్కడో విన్నట్టే అనిపిస్తాయి. కొన్నిచోట్ల ఎమోషనల్ BGM మాత్రం బాగా ఇచ్చారు. హీరో హీరోయిన్స్ మధ్య ఉన్న ఒకే ఒక కమర్షియల్ సాంగ్ లో ఇద్దరికీ డ్యాన్స్ రాదనే విషయం తెలిసిపోతుంది.

Also Read : Rajeev Kanakala : చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ మౌనం ఎందుకు.. స్పందించిన రాజీవ్ కనకాల..

మొత్తంగా ఒక గవర్నమెంట్ టీచర్ కి తన పర్సనల్ గా ఎన్ని బాధలు ఉన్నా స్టూడెంట్స్ కోసం ఎంతలా తాపత్రయపడతారు అనే అంశాన్ని కమర్షియల్ కోణంలో చూపించింది నీతోనే నేను. ఈ సినిమాకు రేటింగ్ 2.5 వరకు ఇవ్వొచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు