Rajeev Kanakala : చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ మౌనం ఎందుకు.. స్పందించిన రాజీవ్ కనకాల..

ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ స్పందించకపోవడంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మరికొంతమంది ఎన్టీఆర్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు.

Rajeev Kanakala : చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ మౌనం ఎందుకు.. స్పందించిన రాజీవ్ కనకాల..

Rajeev kanakala Reacted on Jr NTR Silence on Chandrababu Arrest Issue

Rajeev Kanakala :  ఏపీలో మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ పై టిడిపి నాయకులు, పలువురు అభిమానులు విమర్శలు చేస్తూ, అరెస్ట్ కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ పై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. నందమూరి కుటుంబం కూడా అరెస్ట్ కి నిరసనగా మాట్లాడారు. కానీ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ఇప్పటివరకు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించకపోవడం చర్చగా మారింది.

ఎన్టీఆర్ గతంలో టీడీపీ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ స్పందించకపోవడంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మరికొంతమంది ఎన్టీఆర్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ ఎందుకు స్పందించట్లేదు అనే దానిపై కూడా పలువురు వ్యాఖ్యానించారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు అనే విషయంపై నటుడు, ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల స్పందించారు.

తాజాగా రాజీవ్ కనకాల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ మౌనం గురించి, ఎన్టీఆర్ పై వచ్చే విమర్శల గురించి యాంకర్ అడిగారు. దీనికి రాజీవ్ సమాధానమిస్తూ.. ఆయనకు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంటే అతనే చెప్తాడు. గతంలో అతను పార్టీకి ప్రచారం చేశాడు, అతని స్పీచ్ లతో అందర్నీ ఉర్రూతలూగించాడు. అతనికి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదు కానీ ఇప్పుడు ఉండకపోవచ్చు. ఇంకో అయిదేళ్ల తర్వాత అయితే ఉండొచ్చేమో. ప్రజెంట్ తన ఫోకస్ అంతా కెరీర్ మీదే ఉంది. కొంతమంది అతనిపై కావాలని నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారా లేకా నిజంగానే నెగిటివ్ వస్తుందా అనేది సోషల్ మీడియాలో తెలియట్లేదు. ఎందుకు మౌనంగా ఉన్నాడు అనేది నాకు కచ్చితంగా తెలీదు. అతను దాని గురించి నా దగ్గర మాట్లాడలేదు. అలాగే కరోనా వల్ల, RRR సినిమా వల్ల నాలుగేళ్లు ఎన్టీఆర్ కి ఎక్కువ టైం పోయింది. లేకపోతే ఈ గ్యాప్ లో ఇంకో మూడు సినిమాలు తీసేవాడు. ఇప్పుడు దేవర బిజీలో ఉన్నాడు. అతనికి నటన అంటే ఇష్టం. వీటి మీద ఫోకస్, సినిమాల బిజీ వల్లే స్పందించట్లేదేమో. అయినా ఎన్టీఆర్ రావాలనుకున్నప్పుడు, రాజకీయాలు నేర్చుకొని మరీ వస్తాడేమో. ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఒక పార్టీకి కొమ్ము కాయడం, పార్టీ పరంగా విమర్శలు చేయడం వేరు. కానీ ఇప్పుడు అంతా తిట్టుకోవడాలే ఉంది. అది కరెక్ట్ కాదు కదా అని వ్యాఖ్యానించారు.

Also Read : Producer SKN : ఏకంగా నలుగురు డైరెక్టర్స్‌తో నెక్స్ట్ సినిమాలు ప్లాన్ చేసిన బేబీ ప్రొడ్యూసర్.. స్పెషల్ ఫొటో షేర్ చేసి..

దీంతో రాజీవ్ కనకాల చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే ఎప్పటికైనా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారు అని మాత్రం రాజీవ్ కనకాల ఇండైరెక్ట్ గా చెప్పడంతో ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తాడా అని చర్చగా మారింది.