Vinaro Bhagyamu Vishnu Katha Teaser Launch
Vinaro Bhagyamu Vishnu Katha Teaser : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. గత ఏడాది మూడో సినిమాలతో ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ హీరో.. ఈ సంవత్సరం మొదటిలోనే మరో మూవీని ప్రేక్షకుల ముందు తీసుకువస్తున్నాడు. మంచి యూత్ ఫుల్ సినిమాలతో యూత్ లో క్రేజ్ ని సంపాదించుకున్న ఈ నటుడు.. ఈసారి ఒక కొత్త కాన్సెప్ట్ రాబోతున్నాడు. ‘వినరో భాగ్యం విష్ణు కథ’ అంటూ క్లాసికల్ టైటిల్ పెట్టుకున్న ఈ మూవీ టీజర్ ని నేడు విడుదల చేశారు.
Kiran Abbavaram : నన్ను ఇండస్ట్రీ నుంచి పంపిచేద్దాం అనుకుంటున్నారు.. కిరణ్ అబ్బవరం!
ఈ సినిమా కథ మొత్తం తిరుపతి ఏడు కొండల చుట్టూ తిరగనుంది. ఇక టీజర్ తో.. సినిమాలో ఫ్యామిలీ, లవ్, కామెడీ, యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పేలా కట్ చేశారు. నటుడి మురళి శర్మ ఈ సినిమాలో హీరోయిన్ ప్రేమించే ఒక కామెడీ రోల్ చేస్తున్నాడు. దీంతో వీరి ముగ్గురు మధ్య వచ్చే సన్నివేశాలు అందర్నీ నవ్వించేలా ఉండబోతున్నాయి అని తెలుస్తుంది. టీజర్ గురించి మాట్లాడుకుంటే.. హీరో కిరణ్ అబ్బవరం డాన్ డెన్ లో కూర్చొని తన కథ చెబుతుంటాడు. ఇలా లవ్ అండ్ కామెడీగా సాగుతున్న టీజర్ ఒక బాంబు బ్లాస్ట్ మొత్తం సీరియస్ మోడ్ లోకి మారిపోతుంది.
అక్కడి నుంచి అంతా సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగుతుంది. ఈ క్రమంలో ఒక పక్క కిరణ్ మరో పక్క టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోరాడుతూ వస్తుంటారు. టోటల్ గా సినిమా.. ‘కాన్సెప్ట్ తో మొదలై లవ్ అండ్ కామెడీ మిక్స్ అయ్యి. క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా’ అంటూ టీజర్ లో చెప్పుకొచ్చాడు కిరణ్ అబ్బవరం. అయితే అసలు కాన్సెప్ట్ ఏంటి అనేది మాత్రం త్వరలో చెబుతాను అంటున్నాడు. ఇక టీజర్ ఎండ్ లో మురళి శర్మ.. ‘నీ కాళ్ళని పట్టుకొని వదలన్నది’ సాంగ్ స్టెప్ అందరికి నవ్వులు పూయించింది.
ఈ సినిమాలో హీరోయిన్ గా కాశ్మీర నటిస్తుంది. మురళి కిషోర్ అబ్బుర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. టీజర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అలాగే మొన్న విడుదల చేసిన ‘వాసవ సుహాస’ సాంగ్వి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇక రిలీజ్ అయిన ఈ టీజర్ అందరిలో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ టైం కిరణ్ గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో తన కెరీర్ ని మలుపు తిప్పే హిట్టుని అందుకుంటాడా అనేది చూడాలి. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.