Kiran Abbavaram : నన్ను ఇండస్ట్రీ నుంచి పంపిచేద్దాం అనుకుంటున్నారు.. కిరణ్ అబ్బవరం!

టాలీవుడ్ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన మరో యంగ్ హీరో 'కిరణ్ అబ్బవరం'. తన స్క్రిప్ట్ సెలక్షన్ తో ఇండస్ట్రీలో హీరోగా నిలబడడానికి ట్రై చేస్తున్న కిరణ్ పై సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరుగుతుంటుంది. చివరిగా కిరణ్ నుంచి వచ్చిన సినిమా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'. ఈ చిత్రంలో..

Kiran Abbavaram : నన్ను ఇండస్ట్రీ నుంచి పంపిచేద్దాం అనుకుంటున్నారు.. కిరణ్ అబ్బవరం!

Kiran Abbavaram about trollings

Kiran Abbavaram : టాలీవుడ్ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన మరో యంగ్ హీరో ‘కిరణ్ అబ్బవరం’. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన ఈ యువహీరో.. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేశాడు. మొదటి చిత్రంతోనే మంచి హిట్టుని అందుకొని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడు గానే కాదు రైటర్ గా కూడా ఎక్స్‌పిరెన్స్ ఉన్న కిరణ్.. తన రెండో సినిమా ఎస్‌ఆర్ కల్యాణమండపంకి తానే కథని అందించాడు. ఇక ఈ సినిమా యూత్ లో ఈ హీరోకి మంచి క్రేజ్ ని సంపాదించి పెట్టింది.

Vinaro Bhagyamu Vishnu Katha: గుడి ముందు బసవన్నతో కిరణ్ పర్ఫెక్ట్ మాస్ లుక్!

తన స్క్రిప్ట్ సెలక్షన్ తో ఇండస్ట్రీలో హీరోగా నిలబడడానికి ట్రై చేస్తున్న కిరణ్ పై సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరుగుతుంటుంది. చివరిగా కిరణ్ నుంచి వచ్చిన సినిమా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. ఈ చిత్రంలో కిరణ్ ఇంట్రడక్షన్ సీన్ లో కిరణ్ అబ్బవరం అనే టైటిల్ కార్డు పడితే. దానిని ఎడిట్ చేసి మిమర్స్ ‘పవర్ స్టార్ కిరణ్ అబ్బవరం’ అంటూ మార్చారు. ఇక దాని చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ సినిమా చూడకుండా, అది నిజం అనుకోని కిరణ్ పై సోషల్ మీడియా వేదికగా దాడి చేశారు.

తాజాగా దీనిపై ఈ హీరో స్పందించాడు. ‘ఒక సినిమాలో నేను వేసుకోకపోయినా, పవర్ స్టార్ అనే ట్యాగ్ ఎడిట్ చేసి మిమర్స్ వేశారు. నన్ను ఏదో చెయాలి అని అనుకుంటున్నారు. త్వరగా ఇండస్ట్రీ నుంచి పంపిచేద్దాం అనుకుంటున్నారు. అందుకోసం మరి ఇంత దారుణంగా చేస్తారు. దాని కూడా చాలా మంది జనాలు నమ్మేస్తున్నారు’ అంటూ వ్యాఖ్యానించాడు. కాగా ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం “వినరో భాగ్యం విష్ణు కథ”. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ అండ్ సాంగ్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఫస్ట్ టైం కిరణ్ గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో తన కెరీర్ ని మలుపు తిప్పే హిట్టుని అందుకుంటాడా అనేది చూడాలి.