‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం ‘వినయ విధేయ రామ’.. ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించారు. డివివి దానయ్య నిర్మించారు. భారీ అంచనాల మధ్య గతేడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఊర మాస్ పాత్రలో రామ్ చరణ్‌ను అభిమానులు అంగీకరించలేకపోయారు.
కట్ చేస్తే.. వెండితెర మీద సత్తా చాటలేకపోయినా బుల్లితెర మీద మాత్రం ఈ సినిమా మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఓ ఛానెల్‌లో ప్రసారమవుతున్న ఈ సినిమా మంచి రేటింగ్‌లు దక్కించుకోవడం విశేషం. ఇటీవల ఆ ఛానెల్‌లో తొమ్మిదోసారి ప్రసారమైన ‘వినయ విధేయ రామ’ ఏకంగా 6.41 రేటింగ్ సాధించింది. దీంతో ‘అతడు’ తరహాలోనే ‘వినయ విధేయ రామ’ కూడా బుల్లితెర సూపర్‌హిట్‌గా నిలిచిందన్నమాట.
Read:కిరాణ దుకాణం పెట్టుకున్న దర్శకుడు