Vindu Dara Singh : మందు తాగి ఆదిపురుష్ సినిమా తీశారా? మా నాన్న పరువు తీశారు.. చిత్ర యూనిట్ పై ఫైర్ అయిన నటుడు..

తాజాగా మరో బాలీవుడ్ నటుడు ఆదిపురుష్ సినిమా యూనిట్ పై తీవ్ర విమర్శలు చేశాడు. నటుడు విందు ధారా సింగ్ ఆదిపురుష్ సినిమాపై, హనుమంతుడి పాత్రపై విమర్శలు చేశాడు.

Vindu Dara Singh fires on Adipurush Movie unit and Hanuman Character

Adipurush :  ప్రభాస్(Prabhas) రాముడిగా ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆదిపురుష్ రిలీజ్ రోజు నుంచే దారుణమైన విమర్శలు ఎదుర్కొంది. రామాయణాన్ని, అందులో పాత్రల స్వరూపాలని, డైలాగ్స్ ని ఇష్టమొచ్చినట్టు మార్చేసి రాయడంతో డైరెక్టర్ ఓం రౌత్, రైటర్ మనోజ్ లపై దేశవ్యాప్తంగా దారుణంగా ట్రోల్ చేశారు. సినిమా పూర్తిగా వివాదాలమయంగా నిలిచింది. అభిమానులు, నెటిజన్లతో పాటు అనేకమంది ప్రముఖులు కూడా ఆదిపురుష్ సినిమాని విమర్శిస్తున్నారు.

తాజాగా మరో బాలీవుడ్ నటుడు ఆదిపురుష్ సినిమా యూనిట్ పై తీవ్ర విమర్శలు చేశాడు. నటుడు విందు ధారా సింగ్ ఆదిపురుష్ సినిమాపై, హనుమంతుడి పాత్రపై విమర్శలు చేశాడు. బాలీవుడ్ సూపర్ హిట్ రామాయణం సీరియల్ లో హనుమంతుడి పాత్ర పోషించిన ధారా సింగ్ తనయుడు విందు ధారా సింగ్. ఇతను కూడా పలు మార్లు హనుమంతుడి పాత్ర పోషించారు.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విందు ధారా సింగ్ మాట్లాడుతూ.. హనుమంతుడు చాలా పవర్ ఫుల్ గా ఉంటారు. ఎప్పుడూ నవ్వుతు ఉంటారు. ఈ సినిమాలో హనుమంతుడిగా నటించిన దేవదత్తా సరిగ్గా మాట్లాడలేదు కూడా. ఆ పాత్రని వ్యంగ్యంగా కొన్ని చోట్ల చూపించారు. వీళ్ళు చేసిన పని చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది. మందు తాగి సినిమా తీసినట్టు వాళ్ళేం చేస్తున్నారో ఆలోచన కూడా లేకుండా చేసినట్టు ఉంది. ఒక మంచి సినిమా తీసే గోల్డెన్ ఛాన్స్ ని నాశనం చేశారు. కథని ఇష్టమొచ్చినట్టు మార్చేశారు. అందుకే ఆదిపురుష్ అందర్నీ తీవ్రంగా నిరాశ పరిచింది అని అన్నారు.

ఇక వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతూ.. హనుమంతుడి పాత్రలో మా నాన్న చరిత్ర సృష్టించారు. ఆయన నటనకు మీరు దరిదాపుల్లోకి కూడా రారు. హనుమంతుడు క్యారెక్టర్ ని ఇలా చేసి ఆయన పేరుని నాశనం చేస్తున్నారు అంటూ ఆదిపురుష్ టీంపై ఫైర్ అయ్యారు. దీంతో విందు ధారా సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

O Saathiya : సెన్సార్ నుంచి క్లీన్ U సర్టిఫికెట్ తెచ్చుకున్న ఓ సాథియా.. జూలై 7న గ్రాండ్‌గా విడుదల

ఇక ఆదిపురుష్ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. 1000 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగితే 470 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు సమాచారం. ఇంకా 500 కోట్ల కలెక్షన్స్ కూడా రాకపోవడం గమనార్హం. చాలా చోట్ల ఆదిపురుష్ సినిమా కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదని సమాచారం. ప్రభాస్ అభిమానులు మాత్రం ఆదిపురుష్ రిజల్ట్ తో చాలా నిరుత్సాహ పడ్డారు.

ట్రెండింగ్ వార్తలు