Virat and Anushka : తమ గొప్ప మనసుని చాటుకున్న విరుష్క జంట..

స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. తమ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని దుబాయ్‌లో స్నేహితులతో కలిసి జరుపుకున్నారు. ఇక దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన ఈ జంట ఉత్తరాఖండ్ లోని బాబా నీమ్ కరోలి బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించుకున్నారు. ఈ క్రమంలో అక్కడి ఆశ్రమవాసులతో మాట్లాడి వారి మంచిచెడ్డలు తెలుసుకున్న విరుష్క జంట..

Virat and Anushka : తమ గొప్ప మనసుని చాటుకున్న విరుష్క జంట..

Virat and Anushka showed their great heart

Updated On : January 5, 2023 / 7:42 AM IST

Virat and Anushka : స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. తమ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని దుబాయ్‌లో స్నేహితులతో కలిసి జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన ఈ జంట ఉత్తరాఖండ్ లోని బాబా నీమ్ కరోలి బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించుకున్నారు.

Anushka Sharma : ‘చక్ దే ఎక్స్‌ప్రెస్’ షూటింగ్ కంప్లీట్.. ఇండియన్ క్రికెటర్‌గా అనుష్క..

దాదాపు గంటసేపు ఆశ్రమంలోనే ఉన్న ఈ జంట.. కొంతసేపు బాబా సమాధి వద్ద ధ్యానం చేసుకున్నారు. ఆ తరువాత అక్కడి ఆశ్రమవాసులతో మాట్లాడి వారి మంచిచెడ్డలు తెలుసుకున్న విరుష్క జంట, వారికీ దుప్పట్లు పంచి తమ ఉదారతను చాటుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో, నెటిజెన్లు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా పెళ్లి తరువాత 4 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క.. మళ్ళీ ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చింది. ఇటీవలే తాను నిర్మించిన ఒక సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. ప్రస్తుతం ఈ భామ ఇండియన్ ఉమెన్స్ క్రికెర్ట్ టీంలోని ఒకప్పటి స్టార్ బౌలర్ ‘ఝులన్ గోస్వామి’ బయోపిక్ లో నటిస్తుంది. ‘చక్ దే ఎక్స్‌ప్రెస్’ అనే టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది.