×
Ad

Karthik Dandu : విరూపాక్ష దర్శకుడు నుంచి మరో థ్రిల్లర్.. ఈసారి పురాణగాథలోని మిస్టరీ..

విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు కొత్త సినిమాని కాన్సెప్ట్ పోస్టర్ తో అనౌన్స్ చేశాడు. ఈసారి మిస్టిక్ థ్రిల్లర్ కాదు మైథికల్ థ్రిల్లర్‌తో..

  • Published On : August 14, 2023 / 02:37 PM IST

Virupaksha director Karthik Dandu announce his new movie in MYTHICAL THRILLER genre

Karthik Dandu : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) యాక్సిడెంట్ నుంచి కోలుకొని కమ్‌బ్యాక్ ఇస్తూ చేసిన సినిమా ‘విరూపాక్ష’ (Virupaksha). క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాకి కార్తీక్ కథని అందించగా సుకుమార్ స్క్రీన్ ప్లే రాశాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది.

Kushi Movie : విజయ్ దేవరకొండ సమంత ఖుషి ఆడియో లాంచ్.. ఇండిపెండెన్స్ డే స్పెషల్..

ఈ బ్లాక్ బస్టర్ తరువాత ఈ కాంబినేషన్ నుంచి మరో సినిమా రాబోతుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో సుకుమార్ అండ్ బివిఎస్‌ఎన్ నిర్మాణంలో కొత్త మూవీని నేడు అనౌన్స్ చేశారు. విరూపాక్ష చిత్రాన్ని మిస్టిక్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తే, ఈ కొత్త ప్రాజెక్ట్ ని మైథికల్ థ్రిల్లర్ గా రూపొందించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యిందంటూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. పోస్టర్ చాలా ఇంటరెస్టింగ్ గా కనిపిస్తూ సినిమా పై క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది.

Bigg Boss 7 : బిగ్‌బాస్ లోకి కెవ్వు కార్తీక్.. అందుకే జబర్దస్త్ మానేశాడా?

అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్, ఇతర టెక్నీషియన్స్ గురించి ఇంకా ఏమి తెలియజేయలేదు. త్వరలోనే పూర్తి వివరాలు పై మూవీ టీం నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా విరూపాక్ష సినిమా ఎండింగ్ ని కూడా దర్శకుడు ఓపెన్ గా ఎండ్ చేశాడు. దీంతో ఈ మూవీకి సీక్వెల్ ఉండబోతుంది అనే ప్రశ్నను విరూపాక్ష సక్సెస్ మీట్ లో సాయి ధరమ్ తేజ్ ని ప్రశ్నించగా తను బదులిస్తూ.. ‘సీక్వెల్ కోసమే ఎండింగ్ ని ఓపెన్ గా పెట్టాము’ అంటూ బదులిచ్చాడు. మరి ఆ సీక్వెల్ ఎప్పుడు తెరపైకి రానుందో చూడాలి.