Vishakha Singh : హాస్పిటల్ బెడ్ పై హీరోయిన్.. పోరాడుతున్నాను అంటూ పోస్ట్..

విశాఖ సింగ్ ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో ఉండి చికిత్స తీసుకుంటుంది. తాజాగా హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది విశాఖ.

Vishakha Singh in Hospital with Health Issues

Vishakha Singh :  జ్ఞాపకం(Gnapakam) అనే తెలుగు(Telugu) సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది విశాఖ సింగ్(Vishakha Singh). ఆ తర్వాత హిందీ(Hindi), తమిళ్(Tamil) లోనే సినిమాలు చేసింది. మధ్యలో తెలుగులో నారా రోహిత్(Nara Rohit) సరసన రౌడీ ఫెలో(Rowdy Fellow) అనే ఓ సినిమా చేసింది. తెలుగులో ఆ రెండు సినిమాల్లో తప్ప మళ్ళీ కనపడలేదు. తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ భామ చివరిసారిగా 2017లో ఓ హిందీ సినిమాతో ప్రేక్షకులని పలకరించింది. అప్పట్నుంచి సినిమాలకు దూరంగానే ఉంటుంది.

విశాఖ సింగ్ ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో ఉండి చికిత్స తీసుకుంటుంది. తాజాగా హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది విశాఖ.

Rajamouli – Mahesh Babu : రాజమౌళి సినిమాలో మహేష్ హనుమంతుడి పాత్ర.. అమెజాన్ అడవుల్లో సాహసం!

ఫోటోలను షేర్ చేస్తూ.. నేను ఎక్కువసేపు కిందపడి ఉండలేను. శీతాకాలంలో, వసంతకాలంలో నాకు వరుసగా విచిత్ర సంఘటనలు, ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి. మళ్ళీ వేసవి రాగానే నా ఆరోగ్యం తిరిగి పుంజుకుంటుంది. ఇది తరచుగా జరుగుతుంది. ఏప్రిల్ నాకు ఎప్పుడూ కొత్త సంవత్సరంలా అనిపిస్తుంది. బహుశా ఇది కొత్త ఆర్ధిక సంవత్సరం లేదా నేను పుట్టిన నెల కాబట్టి ఏమో. ఎండాకాలం రాగానే మళ్ళీ ఆరోగ్యం కుదుటపడి పూర్తి ఉత్సాహంతో ముందుకి సాగుతాను. మంచి రోజులు ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపింది విశాఖ సింగ్. దీంతో పలువురు నెటిజన్లు, ప్రముఖులు విశాఖ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.