Vishal announce his 34 project with hari under 3rd collaboration
Vishal : తమిళ్ హీరో విశాల్ సెట్స్ పై ఒక సినిమా పూర్తి అవుతున్న సమయంలోనే ఒక మూవీ షూటింగ్ మొదలు పెట్టేస్తాడు. మరో మూవీని ప్రకటించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెడతాడు. ప్రస్తుతం ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) సినిమాలో నటిస్తూ, మరోపక్క స్వీయ దర్శకత్వంలో డిటెక్టీవ్ 2 (Detective 2) ని కూడా తెరకెక్కిస్తున్నాడు. మార్క్ ఆంటోనీ పనులు చివరి దశకు వచ్చాయో లేదో.. తన కొత్త సినిమాని ప్రకటించేశాడు, అది కూడా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో రాబోతున్నట్లు.
OG Movie : పవన్ లేకుండానే జరుగుతున్న OG షూటింగ్.. 50 డేస్..!
తమిళ మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో తన 34వ సినిమాని అనౌన్స్ చేశాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ ‘భరణి’, ‘పూజ’ సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్టుగా నిలిచాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి విశాల్ ట్వీట్ చేస్తూ.. “మా కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు మాదిరే ఈ మూవీ కూడా ఆకట్టుకుంటుంది. అలాగే ఒక స్పెషల్ ట్రీట్ కూడా ఇవ్వనుంది” అంటూ పేర్కొన్నాడు. అంతేకాదు ఈ మూవీ షూటింగ్ ని కూడా మొదలుపెట్టేశాడు.
Namrata : మహేష్ తనయుడు ‘గౌతమ్’ సినిమా ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన నమ్రతా.. ఆ తరువాతే హీరోగా..!
Delighted & Pumped up to be part of this !
My 3rd combination with Director Hari. Looking forward to create the same magic as before & making it a special treat for audience worldwide.#Vishal34 – Shoot from today!#ProductionNo14 #Hari @stonebenchers @karthiksubbaraj pic.twitter.com/IpoHjpM01V
— Vishal (@VishalKOfficial) July 15, 2023
ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ స్టోన్ బెంచ్ స్టూడియో బ్యానర్ పై నిర్మిస్తుండడం గమనార్హం. జి స్టూడియోస్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కాబోతుంది. ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రియా భవానీ శంకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిసున్నట్లు తెలుస్తుంది. మరి ఈ మూవీతో కూడా హిట్టు కొట్టి హ్యాట్రిక్ కాంబినేషన్ అనిపించుకుంటారా? లేదా ఫెయిల్ అవుతారా? అనేది చూడాలి. ఇక విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ మూవీ విషయానికి వస్తే.. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. సెప్టెంబర్ 15న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.