GK Reddy : ఫిట్ ఇండియా అంబాసిడర్‌గా విశాల్ తండ్రి.. ఆయన ఏజ్ ఎంతో తెలుసా..!

యంగ్ హీరో విశాల్ తండ్రి జి.కె. రెడ్డి ఈ వయసులోనూ బ్రహ్మాండమైన ఫిజిక్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు..

Gk Reddy

GK Reddy: హీరో విశాల్ తండ్రి, ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త జి.కె. రెడ్డి 83 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫిట్‌నెస్‌‌తో ఆశ్చర్య పరుస్తున్నారు. తనయుడు విశాల్‌తో పోటీపడుతూ కండలు తిరిగిన దేహంతో మతిపోగొడుతున్నారు. ఈ వయసులో ఇంతలా ఫిజిక్ మెయింటైన్ చెయ్యడం అంటే మాటలు కాదు.

Evaru Meelo Koteeswarulu : రామ్ – భీమ్ ఎపిసోడ్ హయ్యెస్ట్ టీఆర్‌పీ..!

రీసెంట్‌గా జి.కె. రెడ్డి ఫిట్ ఇండియా అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఫిట్ ఇండియా మిషన్ వారు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రోజూ గంటల తరబడి వ్యాయామం చేస్తే మనసు ప్రశాంతగా, శరీరానికి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంటుంది అని అంటున్నారు జి.కె. రెడ్డి.

గతేడాది జి.కె. రెడ్డి, విశాల్ ఇద్దరు కరోనా బారిన పడ్డారు. ముందు నుంచి వ్యాయామం చేసే అలవాటున్న జి.కె. రెడ్డి త్వరగానే కోలుకున్నారు. కోలుకున్న తర్వాత ఫిజిక్ మీద మరింత ఫోకస్ పెట్టారు. జి.కె. రెడ్డిని యువత స్పూర్తిగా తీసుకోవాలంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.