Vishal is captured in New York city streets walking with girl
Vishal : కోలీవుడ్ హీరో విశాల్ వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. రీసెంట్ గా ‘మార్క్ ఆంటోనీ’ అనే టైం ట్రావెల్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న విశాల్.. ప్రస్తుతం ‘రత్నం’, ‘డిటెక్టివ్ 2’ సినిమాల్లో నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే, విశాల్ కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం విశాల్ న్యూయార్క్ సిటీలో ఉన్నట్లు సమాచారం.
అక్కడ వీధుల్లో ఎవరో అమ్మాయితో విశాల్ చక్కర్లు కొడుతూ కనిపించారు. తనని వీడియో తీస్తున్నారని గమనించిన విశాల్..వెంటనే తన మొహాన్ని దాచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజెన్స్.. ఆ అమ్మాయి ఎవరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇది ప్రమోషన్ అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. విశాల్ తన సినిమా షూటింగ్ కోసమే న్యూయార్క్ వెళ్లారని చెబుతున్నారు.
Also read : Namrata : నాకు మా పేరెంట్స్ తర్వాత ఆమె ఇంపార్టెంట్.. నమ్రత ఆసక్తికర పోస్ట్ ఎవరి గురించి అంటే?
Is that Actor @VishalKOfficial walking with someone in NYC ? pic.twitter.com/ddMESEuKOq
— Ramesh Bala (@rameshlaus) December 26, 2023
ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే ఇలా ఓ వీడియోని ప్లాన్ చేసి షూట్ చేసి రిలీజ్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే అది ఏ మూవీ షూటింగ్ అనేది తెలియదు. కాగా ప్రస్తుతం విశాల్ నటిస్తున్న రత్నం చిత్రాన్ని హరి డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో పూజ, పొగరు రెండు సూపర్ హిట్స్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఇప్పుడు మూడోసారి రత్నంతో హ్యాట్రిక్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక డిటెక్టివ్ 2 విషయానికి వస్తే.. 2017లో తెరకెక్కిన డిటెక్టివ్ సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. విశాల్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మిస్కిన్ డైరెక్ట్ చేశారు. ఇక ఈ సీక్వెల్ సినిమా ఎప్పుడో ఆడియన్స్ ముందుకు రావాల్సిందే. కానీ దర్శకుడు, విశాల్ మధ్య విబేధాలు రావడంతో మూవీ పక్కన బడింది. ప్రస్తుతం ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలు విశాలే తీసుకోని తెరకెక్కిస్తున్నారు.