Namrata : నాకు మా పేరెంట్స్ తర్వాత ఆమె ఇంపార్టెంట్.. నమ్రత ఆసక్తికర పోస్ట్ ఎవరి గురించి అంటే?

నాకు మా పేరెంట్స్ తర్వాత ఆమె ఇంపార్టెంట్ అంటూ నమ్రత ఒక మహిళని పరిచయం చేశారు. ఇంతకీ ఎవరు ఆమె..?

Namrata : నాకు మా పేరెంట్స్ తర్వాత ఆమె ఇంపార్టెంట్.. నమ్రత ఆసక్తికర పోస్ట్ ఎవరి గురించి అంటే?

Mahesh Babu wife Namrata post about most important women in her life

Updated On : December 26, 2023 / 3:16 PM IST

Namrata : టాలీవుడ్ యాక్ట్రెస్, సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత గురించి సపరేట్ గా చెప్పనవసరం లేదు. ఒక నటిగా, బిజినెస్ ఉమెన్‌గా, భార్యగా, అమ్మగా తన భాద్యతలు నిర్వహిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నమ్రత.. తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. నాకు మా పేరెంట్స్ తర్వాత ఆమె ఇంపార్టెంట్ అంటూ ఒక మహిళని పరిచయం చేశారు. ఇంతకీ ఎవరు ఆమె..?

ఆమె పేరు షాలిని కొండ్ర. గత నాలుగు జనరేషన్స్ నుంచి నమ్రత కుటుంబంతో ఆమె ట్రావెల్ అవుతూ వస్తున్నారట. నమ్రత గ్రాండ్ మదర్ (అమ్మమ్మ/నాయనమ్మ) ని జాగ్రతగా చూసుకోవడానికి వచ్చిన షాలిని.. ఆ తరువాత నమ్రత వాళ్ళ మదర్‌ని, ఆ తరువాత నమ్రతను, ఇప్పుడు నమ్రత పిల్లలు గౌతమ్, సితార జాగ్రత్తలు చూసుకుంటూ వస్తున్నారట. ఒక హౌస్ కీపర్‌గా, గార్డియన్‌గా, మదర్‌గా, నానీగా ఎన్నో పాత్రలు పోషిస్తూ వస్తున్న ఆమె పుట్టినరోజు వేడుకను నమ్రత తమ ఇంటిలో నిర్వహించారు.

Also read : Namrata Upasana : మెగా – ఘట్టమనేని క్రిస్మస్.. ఉపాసనతో నమ్రత.. చరణ్, మహేష్ ఎక్కడ?

గౌతమ్, సితార, నమ్రత కలిసి ఈ బర్త్ డే నిర్వహించారు. కాగా షాలినిని గౌతమ్.. దాకదై అనే ఒక ముద్దు పేరుతో పిలుస్తాడట. అయితే ఆ మీనింగ్ ఏంటో అడగకండి మాకు తెలియదంటూ నమ్రత చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ బర్త్ డేకి సంబంధించిన ఫోటో, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

ఇది ఇలా ఉంటే.. నిన్న క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను కూడా నమ్రత పోస్ట్ చేశారు. మెగా కుటుంబంతో కలిసి ఘట్టమనేని ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని జరుపుకున్నారు. నమ్రత, గౌతమ్, సితార, రామ్ చరణ్ భార్య ఉపాసనలు కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫొటోల్లో మహేష్, చరణ్ కనిపించలేదు.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)