Vishal SJ Surya Mark Antony Movie Review and Ratings SJ Surya stole the show
Mark Antony Review : తమిళ హీరో విశాల్ (Vishal) నటించిన కొత్త మూవీ ‘మార్క్ ఆంటోని’. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఎస్ జె సూర్య(SJ Surya), సునీల్, సెల్వ రాఘవన్, రీతూ వర్మ, అభినయ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. నేడు మార్క్ ఆంటోనీ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
కథ విషయానికి వస్తే గ్యాంగ్‌స్టర్ నేపథ్యం ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళ పిల్లల మధ్యలో జరుగుతుంది. హీరోకి ఒక టైం ట్రావెల్ ఫోన్ దొరికితే గతంలో మరణించిన తన తండ్రిని, తల్లిని కాపాడుకోవడానికి ఏం చేశాడు, విలన్ కి దొరికితే అతను ఏం చేశాడు అనేదే కథ. కథ సింపుల్ గా ఉన్నా కథనం మాత్రం చాలా గజిబిజిగా అంటుంది. కథని ముందుకి, వెనక్కి తీసుకువెళ్తూ ఉంటారు. దీంతో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లేలో సందేహాలు వస్తాయి.
సినిమా అంతా 90, 70 దశకాల్లో జరిగిన కథలా చూపించడంతో క్యారెక్టరయిజేషన్స్ కూడా అప్పటిలాగానే డిజైన్ చేసుకున్నారు. కొన్ని సౌండ్స్, స్క్రీన్ ప్లే కూడా అప్పటి సినిమాల్లో ఉండేలానే ఉంటుంది. విశాల్, SJ సూర్య డబల్ రోల్ తండ్రి కొడుకుల్లా చేస్తారు. సినిమా మొత్తం విశాల్, SJ సూర్య ఇద్దరూ తమ నట విశ్వరూపం చూపిస్తారు. ముఖ్యంగా SJ సూర్య సినిమాలో బాగా హైలెట్ అవుతాడు. SJ సూర్యకి నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్ర లభించింది. ఇక సునీల్ పాత్ర కూడా బాగుంటుంది. అభినయ, రీతూ వర్మలకు హీరోయిన్స్ కి అన్ని కమర్షియల్ సినిమాల్లో లాగే తక్కువ స్కోప్ ఉన్నట్టే ఉంటుంది. సెల్వ రాఘవన్ ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తాడు. సెకండ్ హాఫ్ లో సిల్క్ స్మిత లాంటి అమ్మాయిని తెచ్చారు. ట్రైలర్ లో చూపించగా ఆ పాత్రపై ఎక్కువ హైప్ వచ్చింది. కానీ సినిమాలో 2 నిముషాలు కూడా ఆ పాత్ర ఉండదు. ఆ పాత్రతో స్పెషల్ సాంగ్ కూడా ఉండొచ్చు అని వార్తలు వచ్చినా అది కూడా లేదు. సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతూ క్లైమాక్స్ మాత్రం మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
Ramanna Youth : రామన్న యూత్.. లీడర్స్ వెనక తిరిగే ప్రతి యూత్ చూడాల్సిన సినిమా..
సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. GV ప్రకాష్ చాలా అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. కెమెరా వర్క్ కూడా అప్పటి సినిమాల్లో సీన్స్ చూపించినట్టే పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ ఇద్దరినీ పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తూ, టెక్నికల్ సినిమాని గా అద్భుతంగా తెరకెక్కించాడనే చెప్పొచ్చు. బడ్జెట్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. మొత్తానికి విశాల్, SJ సూర్య కలిసి మార్క్ ఆంటోనీ సినిమాతో అదరగొట్టారనే చెప్పొచ్చు. కాకపోతే సినిమా అర్ధమవ్వాలంటే మాత్రం ఒక్కసారి చూస్తే సరిపోదు. సినిమాలో విశాల్ తన పేరు ముందు విప్లవ దళపతి అని, SJ సూర్య నట రాక్షసుడు అని వేసుకోవడం గమనార్హం.
గమనిక: ఈ రివ్యూ, రేటింగ్స్ విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే