Vishnu Manchu : మంచు ఫ్యామిలీలో ముదురుతున్న వివాదం.. దుబాయ్ నుండి వచ్చిన విష్ణు ఏం చెప్పాడు..

గత కొత్త కాలంగా మంచు ఫ్యామిలిలో ఆస్థి గొడవలు జరుగుతున్నాయట.

Vishnu who came from Dubai gave clarity on the quarrels going on in the Manchu family

Vishnu Manchu : మంచు కుటుంబంలో వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మనోజ్ తన తండ్రి మోహన్ బాబుపై కేసు పెట్టగా, మోహన్ బాబు సైతం మనోజ్, ఆయన భార్య మౌనికపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు ఫిర్యాదు మేరకు పహడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో మంచు విష్ణు హైదరాబాద్ చేరుకున్నారు.

మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవలు జరిగిన సమయంలో మంచు విష్ణు దుబాయ్ లో ఉన్నారు. ఆయన తన పర్సనల్ పనుల కారణంగా గత కొన్ని రోజులుగా దుబాయ్ లోనే ఉంటున్నారు. తాజాగా జరుగుతున్న గొడవల నేపథ్యంలో విష్ణు హైదరాబాద్ విమానాశ్రయంకు చేరుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన విష్ణుకు ఎయిర్ పోర్టులో అతని తండ్రి మోహన్ బాబు స్వాగతం పలికారు. వారిద్దరూ ఒకే కారులో జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. ఇవ్వన్నీ ఇంటర్నల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్.. దీని గురించి పెద్ద ఇష్యూ చేయడం అనవసరం. సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ఇదిలాఉంటే.. మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read : Manchu Manoj : మంచు వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన మనోజ్.. అసలేం జరిగిందంటే..

మరోవైపు జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద సన్నిహితుల సమక్షంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. సోమవారం కూడా పెద్దమనుషుల సమక్షంలో మోహన్ బాబు, మనోజ్ మధ్య చర్చలు జరిగాయి. కానీ, వారి మధ్య సయోధ్య కుదరకపోగా.. ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకునే స్థాయికి వివాదం చేరింది. సోమవారం రాత్రి మంచు మనోజ్ తన ట్విటర్ ఖాతాలో మోహన్ బాబుపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.