Manchu Manoj : మంచు వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన మనోజ్.. అసలేం జరిగిందంటే..

సినీ ఇండస్ట్రీలో మంచు ఫామిలీ దుమారం ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు.

Manchu Manoj : మంచు వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన మనోజ్.. అసలేం జరిగిందంటే..

Manchu controversy Manchu Manoj revealed sensational truths

Updated On : December 10, 2024 / 12:28 PM IST

Manchu Manoj : సినీ ఇండస్ట్రీలో మంచు ఫామిలీ దుమారం ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. మంచు తండ్రి కొడుకుల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. తాజాగా మంచు మనోజ్, మోహన్ బాబు ఇద్దరు ఒకరిపై ఒకరు కేసు పెట్టుకున్నారు. అయితే ఎట్టకేలకు మనోజ్ ఈ విషయంపై స్పందించాడు. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక సంచల పోస్ట్ షేర్ చేసాడు. ఇక అందులో..

“నాపై, నా భార్యపై చేసిన ఆరోపణలు అబద్ధం. ఎవరిపై ఆధారపడకుండా సమాజంలో ఎంతో గౌరవంగా ఉంటున్నాం. ఆర్థిక సాయం కోసం కుటుంబం దగ్గర ఎప్పుడు చెయ్యి చాపలేదు. ఎలాంటి ఆస్తులు నేను అడగలేదు. నాకు ఆ ఆలోచన నాకు లేదు. కావాలనే నాపై, నా భార్య పై ఆరోపణలు చేస్తున్నారు. కావాలంటే గత కొంతకాలంగా నేను ఎక్కడ ఉంటున్నానో లోకేషన్‌ ద్వారా విచారణ చెయ్యండి. అమాయకమైన నా 7 నెలల పాపను ఈ వివాదంలోకి లాగడం అమానవీయం. నా పిల్లలను ఎప్పుడూ ఈ విషయంలోకి తీసుకురాకూడదు. ఇది ఈ తప్పుడు ఆరోపణల వెనుక ఉన్న దురుద్దేశాన్ని చూపిస్తుంది. అంతేకాదు వారి ఇంట్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై మా నాన్న తీవ్రంగా దూషిస్తుండడంతో వారు తీవ్రంగా వేదనచెందుతున్నారు. వాటికి సంబందించిన ఆధారాలు సైతం నాదగ్గరున్నాయి అన్నారు.

Also Read : Baby John trailer : ‘బేబీ జాన్’ ట్రైలర్ వచ్చేసింది.. ఫుల్ యాక్షన్ తో అదిరిందిగా..

అంతేకాదు అసలు “సీసీటీవీ ఫుటేజీకి ఏమైంది? విష్ణు సహచరులు విజయ్‌రెడ్డి, కిరణ్‌లు సీసీటీవీ డ్రైవ్‌లను ఎందుకు తొలగించారు? ఈ ట్యాంపరింగ్ తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తుంది. ఎందుకు ఈ ఫుటేజీలను దాచిపెడుతున్నారు? “నేను ఎనిమిదేళ్లకు పైగా మా నాన్న, సోదరుడి చిత్రాల కోసం విశ్రాంతి లేకుండా పని చేస్తున్నాను. పాటలు, ఫైట్లు, మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించాను, తరచుగా కమర్షియల్ హీరోగా నా స్థాయికి తగ్గ పాత్రలను పోషిస్తున్నాను. ఒక్క రూపాయి తీసుకోకుండా, పూర్తిగా నా కుటుంబం కోసం పని చేస్తున్నాను. నేను ఎప్పుడూ ఆస్తులు లేదా వారసత్వం కోసం అడగలేదు. దీనికి విరుద్ధంగా సాక్ష్యాలు చూపించమని నేను సవాలు చేస్తున్నాను. “నన్ను పక్కన పెట్టి మా నాన్న ప్రతి వెంచర్‌లో విష్ణుకు స్థిరంగా మద్దతు ఇచ్చారు. నా త్యాగాలు ఉన్నప్పటికీ, నాకు అన్యాయం జరిగింది. పరువు నష్టం, వేధింపులకు గురయ్యానని తెలిపారు.


గత సెప్టెంబర్‌లో హృదయపూర్వకంగా మా నాన్నను వేడుకున్నాను..ఈ సమస్యలను పరిష్కరించడానికి బహిరంగంగా ఒక కుటుంబ చర్చను పెట్టమని అన్నాను. కానీ వారు నన్ను పట్టించుకోలేదు. అదిపోను ఇప్పుడు ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని మనోజ్‌ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.