Baby John trailer : ‘బేబీ జాన్’ ట్రైలర్ వచ్చేసింది.. ఫుల్ యాక్షన్ తో అదిరిందిగా..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సినిమా బేబీ జాన్.

Varun Dhawan Keerthy Suresh Baby John movie Trailer is out mow
Baby John trailer :టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సినిమా బేబీ జాన్. కాగా ఈ సినిమా కాలీస్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రం యాక్షన్, డ్రామా, రొమాన్స్, కామెడీ నేపథ్యంలో రానుంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. బేబీ జాన్ చిత్రాన్ని ఈ నెల 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అట్లీ, విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ తేరీ’సినిమాకి రీమేక్‌గా ‘బేబీ జాన్’ అనే మూవీ రానుంది.
Also Read : Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు
ఇక ఈ సినిమాను 1 స్టూడియోస్, జియో స్టూడియోస్‌తో కలిసి ప్రియా అట్లీ, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో వామికా గబ్బీ, జాకీ ష్రాఫ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇందులో వరుణ్ ధావన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. క్రైమ్ నేపథ్యంలో తిరిగే కథతో ఈ సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ట్రైలర్ మీరు కూడా చూసెయ్యండి..