Vishnupriya : అమ్మానాన్న చిన్నప్పుడే విడిపోయారు.. అమ్మ చనిపోయాక.. బిగ్ బాస్ లో విష్ణుప్రియ ఎమోషనల్..

గంగవ్వ విష్ణుప్రియని వాళ్ళ నాన్న గురించి అడగడంతో విష్ణుప్రియ మాట్లాడుతూ..

Vishnupriya got Emotional in Bigg Boss while talking about her Family

Vishnupriya : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఏడో వారం నడుస్తుంది. నామినేషన్స్ అయిపోవడంతో టాస్కులు నడుస్తున్నాయి. ఇక మధ్యమధ్యలో కంటెస్టెంట్స్ వాళ్ళ స్టోరీలు చెప్తూ ఉంటారని తెలిసిందే. అందులో కొందరు తమ ఎమోషనల్ స్టోరీలు చెప్తారు. తాజాగా విష్ణుప్రియ తన కుటుంబం గురించి చెప్పి ఎమోషనల్ అయింది.

గంగవ్వ విష్ణుప్రియని వాళ్ళ నాన్న గురించి అడగడంతో విష్ణుప్రియ మాట్లాడుతూ.. నాన్న ఊళ్ళో ఉంటారు. అమ్మకు ఇష్టంలేదని చిన్నప్పటినుంచే నాన్నతో మాట్లాడటం మానేశాము. నాన్నపై ప్రేమ ఉన్నా అమ్మ కోసం మాట్లాడలేదు. నా చిన్నప్పుడే అమ్మానాన్న విడిపోయారు. ఇలాంటి ఘోరం ఎవరి జీవితంలోను జరగకూడదు. అమ్మ చనిపోయాక నాన్నతో ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాను అని చెప్తూ ఎమోషనల్ అయింది. దీంతో గంగవ్వ కూడా ఎమోషనల్ అవ్వడంతో విష్ణుప్రియ ఆమెను హత్తుకుంది.

Also Read : Kiran Abbavaram : స్టేజిపై ఎమోషనల్ అయిన కిరణ్ అబ్బవరం.. ఆ రోజులు గుర్తుచేసుకుంటూ.. కిరణ్ చేసిన పనికి హ్యాట్సాఫ్..

ఇక విష్ణుప్రియ షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి నటిగా, యాంకర్ గా ఎదిగింది. ఇప్పుడు బిగ్ బాస్ తో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.