Kiran Abbavaram : స్టేజిపై ఎమోషనల్ అయిన కిరణ్ అబ్బవరం.. ఆ రోజులు గుర్తుచేసుకుంటూ.. కిరణ్ చేసిన పనికి హ్యాట్సాఫ్..
రణ్ అబ్బవరం మాట్లాడుతూ.. తన షార్ట్ ఫిలిం డేస్ ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.

Kiran Abbavaram got Emotional in Love Reddy Movie Pre Release Event
Kiran Abbavaram : అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా లవ్ రెడ్డి అనే సినిమా రాబోతుంది. ఈ సినిమా అక్టోబర్ 18న రిలీజ్ అవుతుండటంతో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి కిరణ్ అబ్బవరం గెస్ట్ గా వచ్చాడు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోగా ఎదిగి ఇప్పుడు పాన్ ఇండియా సినిమా స్థాయికి ఎదిగాడు కిరణ్ అబ్బవరం. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎదిగిన కిరణ్ అబ్బవరం చాలామంది కొత్తవాళ్లకు ఛాన్సులు కూడా ఇస్తున్నాడు.
లవ్ రెడ్డి హీరో అంజన్ రామచంద్ర కూడా షార్ట్ ఫిలిమ్స్ నుంచే రావడం, అప్పట్నుంచే కిరణ్ కి పరిచయం ఉండటంతో అతనితో ఉన్న స్నేహంతో, అతనికి సపోర్ట్ చేయాలని కిరణ్ అబ్బవరం ఈవెంట్ కి వచ్చాడు. అయితే ఈ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. తన షార్ట్ ఫిలిం డేస్ ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. అలాగే ఈ చిన్న సినిమాకు సపోర్ట్ ఉంటానని ఓ ఆఫర్ కూడా ఇచ్చాడు.
Also Read : Ram Charan : గుండె సమస్యతో పుట్టిన పాపని బతికించిన రామ్ చరణ్.. 53 రోజులు ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీగా..
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. నేనూ, అంజన్ షార్ట్ ఫిలింస్ నుంచి వచ్చాం. ఇదే ప్రసాద్ ల్యాబ్ లో మా షార్ట్ ఫిలిమ్స్ చూసుకున్నాం. ఆ ఎమోషన్స్ ఇప్పటికి ఉన్నాయి. అంజన్, నాకు షార్ట్ ఫిలిమ్స్ తో ఫ్రెండ్ అయ్యాడు. ఆ ఎమోషనల్ బాండింగ్ మా మధ్య ఉంది. చాలా మంది ఇండస్ట్రీలో కష్టాలు పడలేక, ఆర్థిక ఇబ్బందులతో, రకరకాల కారణాలతో వెళ్ళిపోతారు. నాలాగే అంజన్ కూడా ఇక్కడే గట్టిగా నిలబడి ఇవాళ హీరోగా సినిమాతో మీ ముందుకు వస్తున్నాడు. చిన్న సినిమాలను సపోర్ట్ చేయండి. చిన్న సినిమాలు వరద బాధితుల లాంటి వాళ్ళు. వాళ్ళని మీరే సపోర్ట్ చేయాలి. ఈ లవ్ రెడ్డి సినిమా కోసం అంజన్ తో పాటు అతని ఫ్యామిలీ అంతా నిలబడింది అతని కోసం. ఇప్పటివరకు చూసిన కంటెంట్ నాకు నచ్చింది. నా వల్ల అయిన హెల్ప్ నేను చేస్తాను ఈ సినిమాకు. ఆంధ్ర, సీడెడ్, నైజాంలో ఒక్కో షో నేను స్పాన్సర్ చేస్తాను. వచ్చి సినిమా చూసి అందరికి చెప్పండి. అంజన్ ఇండస్ట్రీ నుంచి తిరిగి వెళ్ళడు. ఇక్కడే నిలబడతాడు. నా మాట విని సినిమాకు వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటె ఈ సినిమాకు వెళ్ళండి అంటూ ఎమోషనల్ అయ్యాడు.
తన ఫ్రెండ్ సినిమా కోసం వచ్చి, తోటి షార్ట్ ఫిలిం మేకర్ కు సపోర్ట్ గా నిలుస్తూ, ఎంత ఎదిగినా తనతో ప్రయాణించినవాళ్ళని మర్చిపోకుండా, చిన్న సినిమాకు సపోర్ట్ గా వచ్చి, మూడు షోలు కూడా స్పాన్సర్ చేస్తాను అని చెప్పడం, షార్ట్ ఫిలిం డేస్ గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అవ్వడంతో ఫ్యాన్స్, నెటిజన్లు కిరణ్ అబ్బవరంను అభినందిస్తున్నారు. ఇక కిరణ్ కూడా అక్టోబర్ 31న ‘క’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.