Ram Charan : గుండె సమస్యతో పుట్టిన పాపని బతికించిన రామ్ చరణ్.. 53 రోజులు ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీగా..

చరణ్ తాజాగా గుండె సమస్యతో పుట్టిన ఓ పాపని బతికించాడు.

Ram Charan : గుండె సమస్యతో పుట్టిన పాపని బతికించిన రామ్ చరణ్.. 53 రోజులు ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీగా..

Ram Charan saves a baby born with a heart problem

Updated On : October 17, 2024 / 7:52 AM IST

Ram Charan : రామ్ చరణ్ కూడా తండ్రిలాగే సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటారు. ఓ పక్క సినిమాల్లో దూసుకుపోతూ మరో పక్క బిజినెస్ లో కూడా రాణిస్తూ సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటున్నారు చరణ్. ఇప్పటికే అనేకమందికి హెల్ప్ చేసిన చరణ్ తాజాగా గుండె సమస్యతో పుట్టిన ఓ పాపని బతికించాడు. నిర్మాత SKN తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు.

Also Read : Rakul Preet Singh : పాపం రకుల్.. మరో వారం రోజులు బెడ్ పైనే.. ఆందోళనలో అభిమానులు..

నిర్మాత SKN తన ట్వీట్ లో.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి అభినందనలు. ఆగస్టు 22న ఒక పాప పుట్టింది. ఆ పాపకు సీరియస్ హార్ట్ కండిషన్ ఉంది. పల్మనరీ హైపర్ టెన్షన్ తో బాధపడుతుంది. ఆ పాప ఫ్యామిలీకి ట్రీట్మెంట్ చేయించే స్థోమత లేదు. ఈ విషయం చరణ్ గారి దగ్గరకు వెళ్లడంతో ఆయన ఆ పాపకు కావాల్సిన ట్రీట్మెంట్ మొత్తం ఇప్పించారు. ఎప్పటికప్పుడు ఆ పాప గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. 53 రోజులు ట్రీట్మెంట్ తర్వాత అక్టోబర్ 16న ఆ పాప హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది అని తెలిపారు.

దీంతో రామ్ చరణ్ మంచి మనసుని ఫ్యాన్స్, నెటిజన్లు మరోసారి అభినందిస్తున్నారు. ఒక పాప ప్రాణం కాపాడవంటూ చరణ్ ని ప్రశంసిస్తున్నారు.