Rakul Preet Singh : పాపం రకుల్.. మరో వారం రోజులు బెడ్ పైనే.. ఆందోళనలో అభిమానులు..

వెన్ను నొప్పితో బాధపడుతూ రకుల్ బెడ్ మీదే ఉండటంతో..

Rakul Preet Singh : పాపం రకుల్.. మరో వారం రోజులు బెడ్ పైనే.. ఆందోళనలో అభిమానులు..

Rakul Preet Singh Effected with Back Pain From Last one Week

Updated On : October 17, 2024 / 7:35 AM IST

Rakul Preet Singh : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడ వరుస సినిమాలు చేస్తుంది. ఇటీవలే బాలీవుడ్ నిర్మాతను పెళ్లి చేసుకొని అక్కడే సెటిలైపోయింది. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో పోస్ట్ చేసింది.

సాధారణంగా సెలబ్రిటీలు తమ అందం కాపాడుకోవడానికి డైట్, జిమ్ చేస్తూ ఉంటారు. వీటి కోసం చాలా కష్టపడతారు. తాజాగా రకుల్ మోతాదు మించి జిమ్ లో 80 కిలోల బరువు ఎత్తడంతో ఆమెకు వెన్ను నొప్పి సమస్య వచ్చిందట. అయినా పట్టించుకోకుండా జిమ్ చేయడంతో ఇప్పుడు అది ఎఫెక్ట్ అయిందట.

Also Read : Vijay Antony : మళ్ళీ కొత్త సినిమాతో రాబోతున్న విజయ్ ఆంటోని.. ఇంత ఫాస్ట్ ఏంటి బాబు..

రకుల్ షేర్ చేసిన వీడియోలో.. హాయ్.. ఇది నా హెల్త్ అప్డేట్. ఇటీవల నేను ఒక పిచ్చి పని చేశాను. వెన్ను నొప్పి ఉన్నా పట్టించుకోలేదు. అది ఇప్పుడు ఎక్కువైంది. చికిత్స తీసుకుంటున్నాను. గత ఆరు రోజులుగా బెడ్ మీదే ఉన్నాను. కోలుకోడానికి మరో వారం రోజులు పట్టొచ్చు. ఇలా బెడ్ మీదే ఉండటం నాకు కష్టంగానే ఉంది. త్వరగా కోలుకోవాలి. మన బాడీ ఏదైనా సిగ్నల్ ఇచ్చినప్పుడు దాని గురించి పట్టించుకోకుండా ముందుకు వెళ్లకూడదని నేను దీనివల్ల నేర్చుకున్నాను. నా ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు నాకు మెసేజ్ చేసిన వారందరికీ ధన్యవాదాలు అని తెలిపింది.

ఇలా వెన్ను నొప్పితో బాధపడుతూ రకుల్ బెడ్ మీదే ఉండటంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. రకుల్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.