Vijay Antony : మళ్ళీ కొత్త సినిమాతో రాబోతున్న విజయ్ ఆంటోని.. ఇంత ఫాస్ట్ ఏంటి బాబు..
2023లో నాలుగు సినిమాలు రిలీజ్ చేసిన విజయ్ ఈ సంవత్సరం ఇప్పటికే 3 సినిమాలు రిలీజ్ చేయగా ఇప్పుడు నాలుగో సినిమాతో రాబోతున్నాడు.

Vijay Antony Coming With New Movie Again
Vijay Antony : నటుడిగా, దర్శకుడిగా, లిరిసిస్ట్‌గా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా.. ఇలా అన్ని విభాగాల్లో దూసుకుపోతున్నాడు విజయ్ ఆంటోనీ. ఇటీవల వరుస సినిమాలు చేస్తున్నాడు విజయ్. 2023లో నాలుగు సినిమాలు రిలీజ్ చేసిన విజయ్ ఈ సంవత్సరం ఇప్పటికే 3 సినిమాలు రిలీజ్ చేయగా ఇప్పుడు నాలుగో సినిమాతో రాబోతున్నాడు. దీంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఇంత ఫాస్ట్ ఏంటి బాబు.. ఒక్కొక్క హీరో ఒక సినిమాకే రెండు మూడేళ్లు తీసుకుంటుంటే నువ్వేమో ఒకే సంవత్సరం నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తున్నావు అంటూ ఆశ్చర్యపోతూ అభినందిస్తున్నారు.
Also Read : ఆ టీజర్ రిలీజ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవికి కొత్త టెన్షన్
ఈసారి విజయ్ ఆంటోనీ డిటెక్టివ్ ఫిక్షన్ ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని నిర్మాణంలో లియో జాన్ పాల్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుండగా తాజాగా ఈ సినిమా టైటిల్ ని రిలీజ్ చేసారు. ‘గగన మార్గన్’ అనే ఆసక్తికర టైటిల్ తో టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసారు.
ఈ టైటిల్ పోస్టర్‌లో విజయ్ ఆంటోని గాయపడి ఇంటెన్స్ లుక్‌లో, నీటి అడుగున ఉన్న వ్యక్తిగ ఆరెండు రకాలుగా అకనిపించి సినిమాపై ఆసక్తి నెలకొల్పాడు. అట్టకత్తి, సూదు కవ్వుం, ఇంద్రు నేత్ర నాళై, ఏ1, మాయవన్.. లాంటి సూపర్ హిట్ తమిళ్ సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన లియో జాన్ పాల్ ‘గగన మార్గన్’ సినిమాతో డైరెక్టర్ గా మారబోతున్నాడు.
#ககனமார்கன் 🪱 #గగనమార్గన్ 🪱 #गगनमार्गन 🪱 #ഗഗനമാർഗൻ 🪱 #ಗಗನಮಾರ್ಗನ್@leojohnpaultw @AJDhishan990 @DopYuva @mrsvijayantony@vijayantonyfilm pic.twitter.com/MQAXHLSoiA
— vijayantony (@vijayantony) October 16, 2024
ఈ సినిమాలో సముద్రఖని, మహానది శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో నీటి అడుగున సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయట. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది. థ్రిల్లర్ సినిమాలు అంటే విజయ్ ఆంటోనీ అదరగొట్టేస్తాడు. మరి ఈ గగన మార్గన్ సినిమాతో ఏ రేంజ్ లో మెప్పిస్తాడా చూడాలి.