Vishwak Sen : మాస్ కా దాస్ తో ‘జాతి రత్నాలు’ కాంబో.. మూవీ టైటిల్ ఫిక్స్

మాస్ కా దాస్ జాతి రత్నాలు దర్శకుడు కెవి అనుదీప్‌తో కలిసి ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Vishwak Sen : మాస్ కా దాస్ తో ‘జాతి రత్నాలు’ కాంబో.. మూవీ టైటిల్ ఫిక్స్

Vishvak Sen and director Anudeep Combo Movie Title Fix

Updated On : December 11, 2024 / 11:00 AM IST

Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతకొంత కాలంగా వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇప్పటికే వరుస సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్న ఈ హీరో జాతి రత్నాలు దర్శకుడు కెవి అనుదీప్‌తో కలిసి ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్.

Also Read : Sobhita Dhulipala : పెళ్లి కూతురిగా అక్కినేని కోడలు మాస్ స్టెప్పులు.. వీడియో చూసారా..

ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఫన్ & ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాకి “ఫంకీ” అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. కాగా ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అగ్ర నిర్మాతలు ఎస్ నాగ వంశీ అలాగే సాయి సౌజన్య తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ ఏడాది ఈ బ్యానర్స్ పై వచ్చిన లక్కీ బాస్కర్ సినిమా భారీ సక్సెస్ అయ్యింది. అయితే తాజాగా ఈరోజు హైదరాబాద్‌లో విశ్వక్, దర్శకుడు అనుదీప్, నిర్మాతలు తదితరుల సమక్షంలో ఫంకీ సినిమా లాంచింగ్ ఈవెంట్ జరిగింది. ప్రస్తుతం వాటికి సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఫంకీ సినిమా రెగ్యులర్ షూట్ జనవరి 2025 నుండి ప్రారంభమవుతుందని టీమ్ తెలిపింది. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఇప్పటికే జాతిరత్నాలు సినిమాతో భారీ విహాయన్ని అందుకున్న ఈ డైరెక్టర్ తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అనుదీప్ కామెడీ టైమింగ్ కి, విశ్వక్ మాస్ తోడైతే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అంటున్నారు సినీ ఆడియన్స్. కాగా ఈ సినిమాకి సంబందించిన మరిన్ని అప్డేట్స్ తెలియాల్సి ఉన్నాయి.