Vishwak Sen and Tharun Bhascker Prepared Soil Ganesh Idols for Vinayaka Chavithi Videos goes Viral
Vishwak Sen – Tharun Bhascker : నిన్న వినాయకచవితి పండగను అందరూ ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలనే పూజించండి అని ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు మట్టి విగ్రహాలనే కొని తీసుకొచ్చి పూజలు చేశారు. అయితే ఈ హీరో, డైరెక్టర్ మాత్రం సొంతంగా చేత్తో మట్టి వినాయక విగ్రహాలు తయారుచేసి పూజలు చేశారు.
Also Read : Allu Arjun Family : అల్లు అర్జున్ ఫ్యామిలీ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఫొటోలు చూశారా? క్యూట్ అర్హ, అయాన్..
గతంలో అందరూ మట్టి తీసుకొచ్చి ఇంట్లోకి సొంతంగా మట్టితో వినాయకుడిని తయారుచేసి పూజలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ బయటే కొనుక్కుంటున్నారు. అయితే హీరో విశ్వక్ సేన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నిన్న మట్టి తీసుకొచ్చి సొంతంగా తమ చేతులతో వినాయక విగ్రహాలను తయారుచేసారు. ఆ మట్టి విగ్రహాలనే తమ ఇంట్లో పెట్టి పూజలు చేశారు.
వినాయకచవితి నాడు విశ్వక్, తరుణ్ మట్టి విగ్రహాలను తయారుచేస్తుండగా తీసిన వీడియోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసి వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారగా అభిమానులు, నెటిజన్లు వీరిని అభినందిస్తున్నారు..