Vishwak Sen : నాగ్ అశ్విన్ బయోపిక్ చేస్తున్న విశ్వక్ సేన్..? నిర్మాత వ్యాఖ్యలు వైరల్..

ఇటీవల సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ఫంకీ సినిమా అనౌన్స్ చేసారు.

Vishwak Sen Anudeep Funky Movie Looks like Director Nag Ashwin Biopic Producer Naga Vamsi Comments goes Viral

Vishwak Sen : మొదట్లో కొత్త కొత్త కథలతో ప్రయోగాలు చేసి హిట్స్ కొట్టిన విశ్వక్ సేన్ ఇటీవల రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ మెకానిక్ రాకీ, లైలా సినిమాలతో ఫ్లాప్స్ చూసాడు. లైలా దారుణమైన ఫ్లాప్ అవ్వడంతో ఇకపై జాగ్రత్తగా సినిమాలు చేస్తానని ఓ ట్వీట్ కూడా చేసాడు విశ్వక్. త్వరలో ఫంకీ అనే సినిమాతో రానున్నాడు విశ్వక్ సేన్.

ఇటీవల సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ఫంకీ సినిమా అనౌన్స్ చేసారు. అనుదీప్ సినిమా అంటే ఫుల్ కామెడీ ఉంటుందని తెలిసిందే. తాజాగా నిర్మాత నాగవంశీ ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన నాగవంశీ విశ్వక్ సినిమా గురించి మాట్లాడాడు.

Also Read : NTR Japan Fans : జపాన్ లో ఎన్టీఆర్ క్రేజ్ మాములుగా లేదు.. ఆటోగ్రాఫ్‌ల కోసం చుట్టుముట్టిన లేడీ ఫ్యాన్స్.. ఒక అమ్మాయి అయితే..

నాగవంశీ ఫంకీ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది లవ్, కామెడీ జానర్ సినిమా. గర్ల్ లవ్ కంట్రోల్డ్ కథ. ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది. కొన్ని రషెష్ చూసాను. అందులోనే కామెడీ ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారి బయోపిక్ లా ఉంటుంది. ఒక కొత్త డైరెక్టర్ స్టార్ ప్రొడ్యూసర్ కూతురుతో ప్రేమలో పడితే ఏమైంది అని కథ. గీత గోవిందం వైబ్స్ ఉంటాయి. సినిమా మాత్రం ఫుల్ గా నవ్విస్తుంది అని తెలిపారు.

దీంతో నాగవంశీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత నిర్మాత ఆశ్వినిదత్ కూతురు ప్రియాంక దత్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ పాయింట్ తోనే విశ్వక్ ఫంకీ సినిమా ఉండబోతుంది. నిర్మాత అయితే కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి ఈ సారి అయినా విశ్వక్ హిట్ కొడతాడా చూడాలి.