Gaami : ‘గామి’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా? అదరగొట్టిన విశ్వక్..

తాజాగా ఫస్ట్ డే కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించారు గామి చిత్రయూనిట్.

Vishwak Sen Chandini Chowdary Gaami Movie First Day Collections Details

Gaami : విశ్వక్ సేన్(Vishwak Sen), చాందిని చౌదరి(Chandini Chowdary) ఆరేళ్ళ పాటు కష్టపడి చేసిన సినిమా ‘గామి’. ఓ ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా నిన్న మహాశివరాత్రి సందర్భంగా మార్చ్ 8న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది. విశ్వక్ సేన్ అఘోర పాత్రలో కనిపించగా చాందిని చౌదరి, అభినయ ముఖ్య పాత్రల్లో నటించారు. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ శబరీష్ క్రౌడ్ ఫండింగ్ తో నిర్మించగా యూవీ క్రియేషన్స్ గామి సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేసింది.

టీజర్, ట్రైలర్స్ గామి సినిమా అంచనాలు పెంచగా మొదటి ఆట నుంచే ప్రేక్షకులని మెప్పించింది. ఓ సరికొత్త ప్రయోగాత్మక చిత్రంగా, హాలీవుడ్ విజువల్స్ తో అందర్నీ ఆకట్టుకుంటుంది ఈ సినిమా. ఈ రేంజ్ విజువల్స్ సినిమాని తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించారు. తాజాగా ఫస్ట్ డే కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

Also Read : Hanuman : ఓటీటీలోకి రాకముందే టీవీలోకి వచ్చేస్తున్న ‘హనుమాన్’..

గామి సినిమా మొదటి రోజే 9.07 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక అమెరికాలో 250K డాలర్స్ పైగా కలెక్ట్ చేసి 1 మిలియన్ డాలర్స్ కి దూసుకుపోతుంది. నేడు, రేపు రెండు రోజులు కూడా వీకెండ్ కావడంతో ఈజీగా మూడు రోజుల్లో 30 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది.