Hanuman : ఓటీటీలోకి రాకముందే టీవీలోకి వచ్చేస్తున్న ‘హనుమాన్’..

హనుమాన్ సినిమా ఓటీటీలోకి మార్చ్ లో వస్తుంది, శివరాత్రికి వస్తుంది అని వార్తలు వచ్చినా రాలేదు. ఓటీటీలోకి రాకుండానే టీవీలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది

Hanuman : ఓటీటీలోకి రాకముందే టీవీలోకి వచ్చేస్తున్న ‘హనుమాన్’..

Hanuman Movie Telivision Premiere before OTT Streaming

Updated On : March 9, 2024 / 10:41 AM IST

Hanuman Movie : తేజసజ్జ(Teja Sajja) – ప్రశాంత్ వర్మ(Prasanth Varma) ‘హనుమాన్’ సినిమా సంక్రాంతికి వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ రోజుల్లో 50 రోజులు 150 సెంటర్స్ లో ఆడటమే కాకుండా 350 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హనుమాన్ పెద్ద విజయం సాధించింది. ఈ విజయంపై చిత్రయూనిట్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇటీవలే 50 డేస్ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు చిత్రయూనిట్.

సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ ఓటీటీలోకి వచ్చేసినా హనుమాన్ మాత్రం ఇంకా రాలేదు. హనుమాన్ ఓటీటీ రైట్స్ జీ5 కొనుక్కుంది. ఇటీవల హనుమాన్ సినిమా ఓటీటీలోకి మార్చ్ లో వస్తుంది, శివరాత్రికి వస్తుంది అని వార్తలు వచ్చినా రాలేదు. అయితే హిందీ వర్షన్ మాత్రం ఓటీటీలోకి రాకుండానే టీవీలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. హనుమాన్ హిందీ వర్షన్ కలర్స్ సినీప్లెక్స్ ఛానల్ లో 16 మార్చ్ రాత్రి 8 గంటలకు టెలికాస్ట్ అవ్వనుంది.

Also Read : Sreemukhi : తల్లి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన శ్రీముఖి.. చిన్న ఏజ్ లో పెళ్లి.. ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి..

అదే సమయానికి జియో సినిమాస్ లో కూడా హిందీ వర్షన్ స్ట్రీమింగ్ కి రానుంది. మరి హనుమాన్ తెలుగు, కనడ, తమిళ్, మలయాళం వర్షన్స్ జీ5 ఓటీటీలో ఎప్పట్నించి స్ట్రీమింగ్ అవుతాయో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఓటీటీలో కంటే టీవీలో ముందే టెలికాస్ట్ అవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. థియేటర్స్ లో రికార్డులు సెట్ చేసిన హనుమాన్ టీవీలో టీఆర్పీ ఏ రేంజ్ లో బద్దలు కొడుతుందో చూడాలి.