Sreemukhi : తల్లి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన శ్రీముఖి.. చిన్న ఏజ్ లో పెళ్లి.. ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి..

తాజాగా నిన్న ఉమెన్స్ డే సందర్భంగా, తన తల్లి త్వరలో 50 ఏళ్ళకి చేరువవుతుండటంతో శ్రీముఖి చిన్నప్పుడు, ఇటీవల తల్లితో దిగిన కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Sreemukhi : తల్లి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన శ్రీముఖి.. చిన్న ఏజ్ లో పెళ్లి.. ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి..

Sreemukhi Shares her Mother Photos and Emotional post on Womens Day

Updated On : March 9, 2024 / 9:21 AM IST

Sreemukhi : యాంకర్ గా శ్రీముఖి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం టీవీ షోలలో యాంకర్ గా, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు పోస్ట్ చేస్తూ, అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫొటోలు కూడా పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా నిన్న ఉమెన్స్ డే సందర్భంగా, తన తల్లి త్వరలో 50 ఏళ్ళకి చేరువవుతుండటంతో శ్రీముఖి చిన్నప్పుడు, ఇటీవల తల్లితో దిగిన కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Also Read : Samantha : సమంత బామ్మని చూశారా? మిస్ మై గ్రాండ్ మా అంటూ పోస్ట్..

శ్రీముఖి తన పోస్ట్ లో.. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసిన, నేను చూసిన అందమైన రూపం అమ్మ. ఏమి లేని దగ్గర్నుంచి ఎదిగి నన్ను ఇన్ స్పైర్ చేసి ఎంతోమంది ఫాలోవర్స్ కి దగ్గర చేసింది. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి, చిన్న ఏజ్ లోనే పెళ్లి అయినా ప్యాషన్ తో, పట్టుదలతో బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకొని బ్యూటీషియన్ అయింది. దాంట్లో మాస్టర్ అయి ఎంతోమంది ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది. నా కోసం, నా ఫ్యామిలీ కోసం రెస్ట్ లేకుండా మా అమ్మ పనిచేసింది. నేను గతంలో మరింత లావుగా ఉన్నప్పుడు నన్ను బాడీ షేమింగ్ చేస్తే మా అమ్మ నన్ను ప్రోత్సహించింది, జాగ్రత్తగా చూసుకుంది. నన్ను మరింత స్ట్రాంగ్ గా చేసింది. త్వరలో మా అమ్మ 50కి చేరువ కాబోతుంది . ప్రతి రోజు ఆమె నన్ను ఇన్ స్పైర్ చేస్తూనే ఉంది. ఈ జీవితానికి నీకు రుణపడి ఉంటాను అమ్మ. ఐ లవ్ యు అమ్మ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. దీంతో శ్రీముఖి పోస్ట్ వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)