Gaami : ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న గామి.. ఎప్పుడు.. ఎక్కడ..!

విశ్వక్ సేన్ ప్రయోగాత్మక చిత్రం 'గామి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఎప్పుడు..? ఎక్కడ ప్రసారం కాబోతుంది..?

Vishwak Sen Chandini Chowdary Gaami Movie ott release date update

Gaami : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చిన ప్రయోగాత్మక చిత్రం ‘గామి’. ఈ సినిమాలో విశ్వక్ అఘోరగా నటించగా చాందిని చౌదరి, అభినయ, ఉమా, మహమ్మద్ సమద్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. విద్యాధర్ కాగిత దర్శకత్వం వచించిన ఈ చిత్రం హాలీవుడ్ విజువల్స్, సరికొత్త కాన్సెప్ట్ అండ్ స్క్రీన్ ప్లేతో మార్చ్ 8న థియేటర్స్ లోకి వచ్చి సూపర్ హిట్టుని అందుకుంది.

ఇక థియేటర్ చూసి ఎంజాయ్ చేసిన ఈ చిత్రం.. ఓటీటీకి వస్తే మరోసారి చూసి ఎంజాయ్ చేయాలని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక వెయిటింగ్ కి ఎండ్ కార్డు వేస్తూ.. గామి ఓటీటీ గమ్యానికి డేట్ ఫిక్స్ చేసుకుంది. ఏప్రిల్ 12న నుంచి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రాబోతుంది. జీ5లో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ కాబోతుంది.

Also read : Tillu Square : ఎన్టీఆర్ ఇంట్లో ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ పార్టీ.. ఫోటో వైరల్..

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అఘోరా అయిన శంకర్ (విశ్వక్ సేన్) కి గతం కూడా గుర్తుండదు. అతనికి మనిషి స్పర్శ తగలకూడదు. తగిలితే ప్రాణం పోయినట్టు అవుతుంది. ఈ అరుదైన జబ్బు పోగొట్టే మాలపత్రాలు హిమాలయాల్లో ఓ చోట దొరుకుతాయని శంకర్ కి తెలుస్తుంది. ఇక అదే మాల పత్రాల కోసం జాహ్నవి (చాందిని చౌదరి) కూడా ఇతనితో కలిసి హిమాలయాలకు బయలుదేరుతుంది.

ఈ కథతో పాటు ఒక పల్లెటూరిలోని దేవదాసి కథ, ఎక్కడో హిమాలయాల్లో ఉన్న కర్మగారంలో బందీగా ఉన్న CT-333 అనే వ్యక్తి కథ కూడా సాగుతుంటుంది. ఫైనల్ గా శంకర్ కి, జాహ్నవికి ఆ మాల పత్రాలు దొరికాయా? అలాగే దేవదాసి, CT-333 కథలు ఏంటి..? అసలు వీరు ముగ్గురికి లింక్ ఏంటి..? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు