×
Ad

Vishwak Sen : విశ్వక్ సేన్ అసలు పేరేంటి? పేరు మార్చగానే సినిమాల్లో కలిసొచ్చింది అంటూ..

తాజాగా విశ్వక్ సేన్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర విషయాలని తెలిపాడు. ఈ ఇంటర్వ్యూలో తన అసలు పేరు విశ్వక్ సేన్ కాదని సినిమాల్లోకి వచ్చిన తర్వాతే మార్చుకున్నాను అని తెలిపాడు.

  • Published On : February 17, 2024 / 09:18 AM IST

Vishwak Sen changed his original name after entering into movies

Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం యువ హీరోలలో దూసుకుపోతున్నాడు. వరుసగా కమర్షియల్ సినిమాలతో మెప్పిస్తూ హిట్స్ కొడుతున్నాడు. మరోవైపు డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఆ తర్వాత ఫలక్ నామా దాస్ సినిమాతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విశ్వక్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

తాజాగా విశ్వక్ సేన్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర విషయాలని తెలిపాడు. ఈ ఇంటర్వ్యూలో తన అసలు పేరు విశ్వక్ సేన్ కాదని సినిమాల్లోకి వచ్చిన తర్వాతే మార్చుకున్నాను అని తెలిపాడు.

Also Read : Teja Sajja : అతని డీటెయిల్స్ పంపండి.. నేను కలుస్తాను.. డైహార్డ్ ఫ్యాన్ కోసం తేజ సజ్జ..

విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. అసలు పేరు దినేష్ నాయుడు. సినిమాల్లోకి వచ్చాక ఏం కలిసి రావట్లేదు, అప్పటికే హీరోగా తీసిన వెళ్ళిపోమాకే సినిమా తీసి సంవత్సరం పైనే అవుతున్నా రిలీజ్ అవ్వట్లేదు. ఆడిషన్స్ ఇస్తున్నా సెలెక్ట్ అవ్వట్లేదు. మా నాన్న నా పేరు మార్చారు. దినేష్ నాయుడు నుంచి విశ్వక్ సేన్ అని మార్చారు. పేరు మార్చుకున్న రెండు వారాలకే అప్పటిదాకా హోల్డ్ లో ఉన్న వెళ్ళిపోమాకే సినిమా రిలీజ్ అయింది. ఈ నగరానికి ఏమైంది సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఫలక్ నామా దాస్ ప్రీ ప్రొడక్షన్ మొదలుపెట్టాం. ఈ జాతకాలు, ఆస్ట్రాలజీ నమ్మకపోయినా వాటికి రెస్పెక్ట్ మాత్రం ఇస్తాను అని తెలిపాడు.