Teja Sajja : అతని డీటెయిల్స్ పంపండి.. నేను కలుస్తాను.. డైహార్డ్ ఫ్యాన్ కోసం తేజ సజ్జ..

హనుమాన్ సినిమాలో సూపర్ హీరోగా నటించి పిల్లలకు బాగా దగ్గరయ్యాడు. దీంతో పిల్లల్లో తేజ సజ్జకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా అలాంటి పిల్లల్లో తేజ ఓ డైహార్డ్ ఫ్యాన్ ని కలుస్తానన్నాడు.

Teja Sajja : అతని డీటెయిల్స్ పంపండి.. నేను కలుస్తాను.. డైహార్డ్ ఫ్యాన్ కోసం తేజ సజ్జ..

Hanuman Teja Sajja ready to meet his little Fan

Updated On : February 17, 2024 / 8:42 AM IST

Teja Sajja : చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన తేజ సజ్జ ఇటీవల హనుమాన్(Hanuman) సినిమాతో భారీ సక్సెస్ కొట్టాడు. హనుమాన్ సినిమాలో సూపర్ హీరోగా నటించి పిల్లలకు బాగా దగ్గరయ్యాడు. దీంతో పిల్లల్లో తేజ సజ్జకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా అలాంటి పిల్లల్లో తేజ ఓ డైహార్డ్ ఫ్యాన్ ని కలుస్తానన్నాడు.

ఓ వ్యక్తి హనుమాన్ సినిమాలోని పూలమ్మే పిల్ల.. సాంగ్ కి ఇద్దరు పిల్లలతో కవర్ సాంగ్ చేశారు. ఆ పాటని ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ఈ పాటలో చేసిన బాబు మీకు పెద్ద ఫ్యాన్. మీరంటే చచ్చేంత ఇష్టం. ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు అని పోస్ట్ చేస్తూ తేజ సజ్జని, ప్రశాంత్ వర్మని ట్యాగ్ చేశారు. దీంతో తేజ సజ్జ దీనికి రిప్లై ఇస్తూ.. అతని డీటెయిల్స్ పంపండి నేను కలుస్తాను అని ట్వీట్ చేయడం గమనార్హం.

Also Read : Pushpa 3 : పుష్ప 3 పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఏకంగా పుష్ప ఫ్రాంచైజ్ అంటూ..

హీరోగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సమయంలో తేజ సజ్జ ఇలా అభిమానులకు దగ్గరయితే అతని కెరీర్ కి చాలా ప్లస్ అవుతుంది. తర్వాత సినిమాలకు కూడా ఆదరణ లభిస్తుంది. అందుకే తేజ సజ్జ హనుమాన్ సినిమా మొదట్నుంచి కూడా అందరి దగ్గరికి వెళ్లి ఓపికగా కలుస్తున్నాడు. ఫ్యాన్స్ కి సెల్ఫీలు ఇస్తున్నాడు. ఇప్పుడు ఇలా రిప్లై ఇవ్వడంతో తేజని అభినందిస్తున్నారు.