Pushpa 3 : పుష్ప 3 పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఏకంగా పుష్ప ఫ్రాంచైజ్ అంటూ..

గత కొన్ని రోజులుగా పుష్ప 3 సినిమా కూడా ఉండబోతుందని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై అల్లు అర్జున్ స్పందించాడు.

Pushpa 3 : పుష్ప 3 పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఏకంగా పుష్ప ఫ్రాంచైజ్ అంటూ..

Allu Arjun Reacts on Pushpa 3 Movie at Berlin Film Festival

Updated On : February 17, 2024 / 7:35 AM IST

Pushpa 3 : సుకుమార్(Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వచ్చిన పుష్ప సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కలెక్షన్స్ మాత్రమే కాకుండా ఇప్పటివరకు ఏ తెలుగు హీరో సాధించలేని నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు సాధించి అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు. ప్రస్తుతం పుష్ప 2 పనుల మీద బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. పుష్ప 2 సినిమా ఆగస్టు 15 రాబోతుందని ఆల్రెడీ ప్రకటించారు. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే గత కొన్ని రోజులుగా పుష్ప 3 సినిమా కూడా ఉండబోతుందని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై అల్లు అర్జున్ స్పందించాడు. అల్లు అర్జున్ ఇటీవల బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఇండియన్ సినిమా తరపున బన్నీ వెళ్ళాడు. ఆ ఫిలిం ఫెస్టివల్ లో పుష్ప సినిమాని ప్రదర్శించారు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పుష్ప 3 కూడా ఉండొచ్చు. మేము పుష్పని ఒక ఫ్రాంచైజ్ లా తీసుకెళ్లాలని కూడా అనుకుంటున్నాం అని తెలిపాడు.

Also Read : Anasuya : 24 ఏళ్ళ క్రితం.. NCC కమాండర్‌గా అనసూయ.. వైరల్ అవుతున్న ఫోటో..

దీంతో పుష్ప 3 సినిమా కచ్చితంగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఫ్రాంచైజ్ అంటే ఎన్ని భాగాలు తీస్తారో, వేరే హీరోలు కూడా వస్తారా అని ప్రేక్షకులు ఆసక్తికనబరుస్తున్నారు. పుష్ప సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్, రావు రమేష్.. పలువురు ముఖ్య పాత్రలు ఉండగా ఏవ్ పాత్రలు పుష్ప 2లో కూడా కంటిన్యూ అవుతున్నాయి.