Vishwak Sen Dhamki Locks New Release Date
Dhamki: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని, రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన హిట్ అందుకునేందుకు విశ్వక్ సేన్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను విశ్వక్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమా రిలీజ్ డేట్‌ను గతంలో పలుమార్లు మార్చిన చిత్ర యూనిట్, మార్చి 17న ఈ సినిమాను ఎలాగైనా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యింది.
Dhamki: యూఎస్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్
కానీ, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మరోసారి మార్చింది చిత్ర యూనిట్. ఇక సెన్సార్ పనులు కూడా ముగించుకున్న ‘దాస్ కా ధమ్కీ’ మూవీని మార్చి 17న కాకుండా, మార్చి 22న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. ఓ సరికొత్త పోస్టర్‌తో ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ పోస్టర్‌లో విశ్వక్ సేన్ డ్యుయెల్ రోల్ చేయబోతున్నట్లు మనకు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను విశ్వక్ తనదైన మార్క్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ సినిమాలో అందాల భామ నివేథా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోండగా, రావు రమేష్, హైపర్ ఆది, రోహిని ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.