Vishwak Sen : ఆహాలో విశ్వక్ సేన్ 15 ఎపిసోడ్స్‌తో కొత్త షో.. త్వరలోనే స్టార్ కాబోతుంది..!

ఆహాలో విశ్వక్ సేన్ కొత్త షో. 15 ఎపిసోడ్స్‌తో ఈ షో ఉండబోతుందట. త్వరలోనే ఈ షో..

Vishwak Sen doing a new show in ott aha telugu

Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఒకటి షూటింగ్ పూర్తి చేసుకోగా, మిగతా రెండు సెట్స్ పై ఉన్నాయి. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ హీరో ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో (Aha) ఒక కొత్త షో చేయబోతున్నాడట. ఇప్పటికే ఆహాలో సమంత, కమెడియన్ హర్ష, బాలకృష్ణతో పలు టాక్ షోలు చేసి ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది ఆహా.

Samantha : సమంత చికిత్స కోసం వెళ్లబోతుంది.. ఆమె హెయిర్ స్టైలిష్ట్ ఎమోషనల్ పోస్ట్..

ముఖ్యంగా బాలయ్య అన్‌స్టాపబుల్ (Unstoppable) ఎంతటి సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ షో నుంచి ఇప్పటికి రెండు సీజన్లు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆహా విశ్వక్ తో ఒక షో తీసుకు వస్తుండడంతో అందరిలో ఆసక్తిని కలగజేస్తుంది. ఈ షో మొత్తం 15 ఎపిసోడ్ లు కలిగి ఉంటుందట. ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ షో ఉండబోతుందని, త్వరలోనే ఈ షో ప్రసారం కాబోతుందని ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. ఈ షో గురించి ఆహా త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనుందట. అయితే ఇది టాక్ షోనా..? లేక ఏదైనా గేమ్ షోనా..? అని తెలియక ప్రేక్షకులు తికమకలో పడ్డారు.

Alia Bhatt : కెమెరా మెన్ చెప్పు పట్టుకున్న అలియా భట్.. వీడియో వైరల్!

ఇక విశ్వక్ సినిమాలు విషయానికి వస్తే.. మాస్ కా దాస్ అఘోరగా కనిపిస్తూ చేస్తున్న సినిమా ‘గామి’. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది. VS10, VS11 చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ రెండు చిత్రాల్లో కూడా విశ్వక్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి డైరెక్షన్ లో VS10 తెరకెక్కిస్తుంటే, VS11 మూవీని చల్ మోహన్ రంగ సినిమాని తెరకెక్కించిన కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నాడు.