Funky OTT: ఓటీటీలో విశ్వక్ ‘ఫంకీ’.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విశ్వక్ సేన్ ఫంకీ(Funky OTT) మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది.
- V Santhosh Kumar
- Published On : March 8, 2026 / 12:02 PM IST
Vishwak Sen Funky Movie OTT Streaming Update
- ఓటీటీకి వచ్చేస్తున్న విశ్వక్ సేన్ ‘ఫంకీ’
- స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన నెట్ ఫ్లిక్స్
Funky OTT: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వాక్ సేన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఫంకీ. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ లో లేటెస్ట్ బ్యూటీ కాయదు లోహర్ హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తరువాత మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. అనుదీప్ టైపు కామెడీ బాగానే ఉంట్టప్పటికీ కథ, కథనం మాత్రం పేలవంగా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.
The Taj Story OTT: ఓటీటీలో వివాదాస్పద మూవీ.. ‘ది తాజ్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇందులో భాగాంగానే, ఫంకీ(Funky OTT) సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. ఫంకీ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన చేసింది. దీంతో, ఫంకీ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక, థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది.
