Vishwak Sen : శ్రీవారి నడక దారిలో విశ్వక్ సేన్.. ధమ్కీ హిట్ కోసమేనా..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం 'ధమ్కీ'. తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం, దర్శకుడు కూడా తానే కావడంతో.. ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే..
- gum 95921
- Published On : March 20, 2023 / 10:51 AM IST
Vishwak Sen is praying tirumala tirupati venkateswara for dhamki success
Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న రెండో సినిమా ఇది. గతంలో ‘ఫలక్‌నుమాదాస్’ సినిమాకి దర్శకత్వం వహించాడు. యాక్షన్ కామెడీగా తెరకెక్కుతున్న ధమ్కీ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథని అందిస్తున్నాడు. ఇక పాగల్ చిత్రంతో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న విశ్వక్ అండ్ నివేత పేతురేజ్ మరోసారి ఈ సినిమాలో జంటగా కనిపించబోతున్నారు. తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం, దర్శకుడు కూడా తానే కావడంతో.. ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
Vishwak Sen : కొత్త సినిమా రిలీజ్‌కి ముందే మరో కొత్త సినిమాని స్టార్ట్ చేసిన విశ్వక్ సేన్..
ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ని గెస్ట్ గా తీసుకొచ్చి ఎన్టీఆర్ ఫాన్స్ సపోర్ట్ ని సంపాదించుకున్నాడు. ఇక బాలయ్య ఫాన్స్ సపోర్ట్ ఎప్పుడో సంపాదించిన విషయం తెలిసిందే. అన్ని అనుకున్నట్లు జరిగితే సినిమా భారీ ఓపెనింగ్స్ చూడడం ఖాయం. ఈ నేపథ్యంలోనే అన్ని అనుకున్నట్లు జరగాలి అని తిరుమల శ్రీవారిని మొక్కుకునేందుకు ఈరోజు (మార్చి 20) ఉదయం తిరుపతి చేరుకున్నాడు. నడక దారిలో మెట్లు ఎక్కుతూ శ్రీవారిని చేరుకుంటున్న విశ్వక్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
Vishwak Sen : అర్జున్‌తో వివాదం పై విశ్వక్ సేన్ మరోసారి కామెంట్స్.. ఏమన్నాడో తెలుసా?
ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాతో విశ్వక్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. ఈ నెల 22న పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమా విశ్వక్ కి ఏ రేంజ్ హిట్టు అందిస్తుందో చూడాలి. కాగా ఈ సినిమాని కరాటే రాజ్, విశ్వక్ సేన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా, రామ్ మిరియాల ఒక పాటకి మ్యూజిక్ ఇస్తున్నాడు. రావు రమేష్, అజయ్, తరుణ భాస్కర్, హైపర్ ఆది, అక్షర గౌడ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
