Vishwak Sen : అర్జున్‌తో వివాదం పై విశ్వక్ సేన్ మరోసారి కామెంట్స్.. ఏమన్నాడో తెలుసా?

విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం 'ధమ్కీ'. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో..

Vishwak Sen : అర్జున్‌తో వివాదం పై విశ్వక్ సేన్ మరోసారి కామెంట్స్.. ఏమన్నాడో తెలుసా?

Vishwak Sen comments on controversy with arjun sarja

Vishwak Sen : విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’. ఫ‌ల‌క్‌నుమాదాస్ సినిమా తరువాత మరోసారి దర్శకత్వ బాధ్యతులు తీసుకోని ఈ మూవీని తానే డైరెక్ట్ చేశాడు. నివేత పేతురేజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక రిలీజ్ అయిన ట్రైలర్ అండ్ సాంగ్స్ మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఇప్పటికే ఈ చిత్రం పలు మార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా మార్చి 22న రిలీజ్ సిద్ధమైంది. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరుపుకున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

Vishwaksen : నేను పడిపోతే బాగుండు అని చాలా మంది కోరుకుంటున్నారు.. నేను ఏడవాలని అనుకుంటున్నారు..

కాగా విశ్వక్ సేన్, సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ కి గతంలో ఒక సినిమా గురించి గొడవ అయిన సంగతి తెలిసిందే. అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ ఒక సినిమాకి సైన్ చేశాడు. ఆ సినిమా కోసం అర్జున్ దగ్గర నుంచి విశ్వక్ కొంత రెమ్యూనిరేషన్ కూడా తీసుకున్నట్లు, కానీ షూటింగ్ కి వెళ్లకుండా ఇబ్బంది పెడుతున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి మరి అర్జున్ వెల్లడించాడు. అయితే విశ్వక్, అర్జున్ కి భారీ మొత్తంలో డబ్బు వెనక్కి తిరిగి ఇచ్చినట్లు సమాచారం. దీని గురించి విశ్వక్ ని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, జవాబు ఇచ్చాడు.

విశ్వక్ బదులిస్తూ.. ‘అది అయ్యిపోయిన కథ. ఎంతో మంది మీద ఉన్న గౌరవంతో నేను దాని గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. అయిన ఇప్పుడు ఈ సినిమాకి దానికి అసలు సంబంధం లేదు’ అంటూ ఆ విషయాన్ని దాటేశాడు. కాగా ధమ్కీ సినిమాలో విశ్వక్ డ్యూయల్ రోల్ కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది. రావు రమేష్, అక్షర గౌడ్, తరుణ్ భాస్కర్ రోహిణి, రజిత ప్రధాన పాత్రలు పోషితున్నారు.