Vishwak Sen : కొత్త సినిమా రిలీజ్‌కి ముందే మరో కొత్త సినిమాని స్టార్ట్ చేసిన విశ్వక్ సేన్..

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉంటూనే, నేడు తన కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టాడు. విశ్వక్ కెరీర్ లో 10వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది.

Vishwak Sen : కొత్త సినిమా రిలీజ్‌కి ముందే మరో కొత్త సినిమాని స్టార్ట్ చేసిన విశ్వక్ సేన్..

Vishwak Sen starts his 10th film to pairing with meenakshi chaudhary

Vishwak Sen : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాని విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఫ‌ల‌క్‌నుమాదాస్ సినిమా తరువాత విశ్వక్ మళ్ళీ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ధమాకా వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి కథని అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథని అందిస్తున్నాడు. పాగల్ సినిమా తరువాత నివేత పేతురేజ్ మరోసారి విశ్వక్ కి జంటగా కనిపిస్తుంది. ఈ నెల 22న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.

Vishwak Sen : అర్జున్‌తో వివాదం పై విశ్వక్ సేన్ మరోసారి కామెంట్స్.. ఏమన్నాడో తెలుసా?

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉంటూనే, నేడు తన కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టాడు. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి కథని అందిస్తూ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని తమ 7వ ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నారు. హిట్ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ హీరోయిన్ అనిపించుకున్న మీనాక్షి చౌదరి ఈ మూవీలో హీరోయిన్ గా కనిపించబోతుంది. హైదరాబాద్‌లోని రామా నాయుడు స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి.

Vishwak Sen : బాలకృష్ణ గారు నేను ఫ్రెండ్స్ అయ్యాం..

విశ్వక్ కెరీర్ లో 10వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఈ మూవీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ వెళ్లనుంది అంటూ నిర్మాతలు తెలియజేశారు. అలాగే మూవీలో నటించే ఇతర నటినటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు గురించి కూడా వెల్లడించనున్నారు. ఇక ఈ చిత్రాలతో పాటు ‘గామి’ అనే సినిమాలో కూడా విశ్వక్ నటిస్తున్నాడు. విద్యాధర్ కాగిత డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో కనిపించబోతున్నాడు. త్వరలోనే ఆ సినిమాకు రిలీజ్ కి సిద్దమవుతుంది.