×
Ad

Vishwak Sen : ఒక్క స్పీచ్ లో బోలెడన్ని విషయాలు చెప్పిన విశ్వక్‌సేన్.. డేట్లు లేక ఆ హిట్ సినిమాలు వదిలేసుకోని..

తాజాగా విశ్వక్‌సేన్ మంగళవారం(Mangalavaaram) సక్సెస్ మీట్ కి గెస్ట్ గా వచ్చాడు. విశ్వక్‌సేన్ మాట్లాడుతూ డైరెక్టర్ అజయ్ భూపతి గురించి, సినిమాల గురించి, తన సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలని తెలిపాడు.

  • Published On : November 22, 2023 / 11:08 AM IST

Vishwak Sen missed those movies in Ajay Bhupathi Direction

Vishwak Sen : విశ్వక్‌సేన్.. కూడా టాలీవుడ్(Tollywood) లో సొంతంగా ఎదిగిన నటుడే. షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టి ‘వెళ్ళిపోమాకే’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నామా దాస్ సినిమాలతో మంచి విజయాలు సాధించాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ యూత్ లో తనకంటూ ఓ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. త్వరలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు విశ్వక్‌సేన్.

తాజాగా విశ్వక్‌సేన్ మంగళవారం(Mangalavaaram) సక్సెస్ మీట్ కి గెస్ట్ గా వచ్చాడు. ఈ ఈవెంట్ లో మంగళవారం సినిమా మంచి విజయం సాధించినందుకు చిత్రయూనిట్ అందరికి అభినందనలు తెలిపాడు. అనంతరం విశ్వక్‌సేన్ మాట్లాడుతూ డైరెక్టర్ అజయ్ భూపతి గురించి, సినిమాల గురించి, తన సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలని తెలిపాడు.

విశ్వక్‌సేన్ మాట్లాడుతూ.. అజయ్ అన్న నాకు ఎప్పట్నుంచో తెలుసు. RX 100 సినిమా అప్పుడు నన్ను ఫోటోలు పంపించమన్నాడు. అప్పుడే నేను ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో సెలెక్ట్ అయ్యాను. దీంతో ఫోటోలు పంపలేదు. అలాగే తన రెండో సినిమా ‘మహా సముద్రం’ కథ కూడా నాకు వినిపించాడు. అప్పుడు కూడా డేట్లు అడ్జస్ట్ అవ్వక ఆ సినిమా చేయలేదు అని తెలిపాడు. దీంతో విశ్వక్ RX100, మహా సముద్రం సినిమాలు విశ్వక్ మిస్ అయినట్టు తెలుస్తుంది.

Also Read : Mansoor Ali Khan : త్రిషకు క్షమాపణలు చెప్పేదే లేదు.. త్రిషపై పరువు నష్టం కేసు వేస్తాను..

ఇక తన సినిమాల గురించి మాట్లాడుతూ.. ఫ్యూచర్ లో అజయ్ భూపతితో సినిమా ఉంటుంది అని ప్రకటించాడు. అలాగే ఫలక్ నామాదాస్ 2 కూడా ఉందని ప్రకటించాడు. ఇక చిన్నప్పటి నుంచి తనకి లుంగీ కట్టుకొని కత్తి పట్టుకొని మాస్ క్యారెక్టర్ చేయాలని ఉండేదని, అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో తీరిపోయింది. అలాంటి మాస్ క్యారెక్టర్ లోనే అజయ్ అన్న దర్శకత్వంలో కనిపిస్తాను అని తెలిపాడు విశ్వక్.