Mansoor Ali Khan : త్రిషకు క్షమాపణలు చెప్పేదే లేదు.. త్రిషపై పరువు నష్టం కేసు వేస్తాను..

తాజాగా దక్షిణ భారత నటీనటుల సంఘం మన్సూర్ అలీఖాన్ కి హెచ్చరిక నోటీసులు పంపించి, త్రిషకి సమాధానం చెప్పాలని కోరింది.

Mansoor Ali Khan : త్రిషకు క్షమాపణలు చెప్పేదే లేదు.. త్రిషపై పరువు నష్టం కేసు వేస్తాను..

Mansoor Ali Khan refused to apologize Trisha

Updated On : November 22, 2023 / 10:15 AM IST

Mansoor Ali Khan : తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్(Mansoor Ali Khan) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. చాలా సినిమాల్లో విలన్ గా చాలా మంది హీరోయిన్స్ తో రేప్ సీన్స్ చేశాను. లియో సినిమాలో నన్ను సెలెక్ట్ చేసినప్పుడు త్రిషతో(Trisha) రేప్ సీన్ ఉంటుంది అనుకున్నాను. కానీ లేనందుకు బాధపడ్డాను అని వ్యాఖ్యలు చేయడంతో ఇవి సంచలనంగా మారాయి. మన్సూర్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతన్ని బ్యాన్ చేయాలనీ, అతన్ని అరెస్ట్ చేయాలనీ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ చేశారు.

మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై త్రిష కూడా తీవ్రంగా స్పందిస్తూ.. ఆ వ్యాఖ్యలని ఖండించి, అతనితో నటించలేదు, ఇకపై నటించాను అని కామెంట్స్ చేసింది. త్రిషకి సపోర్ట్ గా లియో దర్శకుడు లోకేష్ కానగరాజ్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, మాళవిక, చిన్మయి, నితిన్, చిరంజీవి.. ఇలా చాలా మంది ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు ట్వీట్స్ చేస్తూ మన్సూర్ పై విమర్శలు చేస్తున్నారు.

ఇప్పటికే మన్సూర్ దీనిపై వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేసాడు. తన ఇంటర్వ్యూ మొత్తం చూడకుండా మాట్లాడుతున్నారని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనకి కూడా కూతురు, ఫ్యామిలీ ఉందని, నేను ఏ తప్పుడు కామెంట్స్ చేయలేదని, దీనిని కొంతమంది కావాలని పెద్ద ఇష్యూ చేస్తున్నారని కామెంట్స్ చేశాడు. అయితే తాజాగా దక్షిణ భారత నటీనటుల సంఘం అతనికి హెచ్చరిక నోటీసులు పంపించి, త్రిషకి సమాధానం చెప్పాలని కోరింది.

దీనిపై మన్సూర్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి.. నేను అన్న వ్యాఖ్యలను తప్పుగా ప్రమోట్ చేశారు. సినిమాల్లో నిజంగానే రేప్ చేస్తారా? సీన్స్ ఎలా షూట్ చేస్తారో తెలీదా? నేను త్రిషకు క్షమాపణలు చెప్పను. నేనేం తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. నా మీద ఇప్పటికే చాలా మంది సినిమా వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ చేశారు. నా మీద కామెంట్స్ చేసేవాళ్లంతా మంచోళ్ళా? నేను త్రిషపై పరువు నష్టం కేసు వేస్తాను. నడిగర్ సంఘం నా వైపు వివరణ వినకుండా, వినే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నాకు ఎందుకు నోటీసులిచ్చింది అని అన్నాడు. దీంతో మన్సూర్ మరోసారి వైరల్ అవుతున్నారు.

Also Read : Mansoor Ali Khan : నా మీద తప్పుడు ప్రచారం.. నేనెలాంటివాడ్నో అందరికి తెలుసు.. త్రిషపై వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన మన్సూర్ అలీఖాన్..

అయితే ఈ విషయంలో మన్సూర్ కి కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. మన్సూర్ తనకి గతంలో అలాంటి రోల్స్ ఇచ్చారు, ఇందులో కూడా అలాంటి రోల్ ఇస్తారనుకున్నట్టు క్లారిటీగా చెప్పాడు. దీన్ని కొంతమంది నెగిటివ్ గా ప్రమోట్ చేసి ఇంత పెద్ద వివాదం సృష్టించారని అతనికి సపోర్ట్ చేసే వాళ్ళు మాట్లాడుతున్నారు.