Vishwak – Neha : నిన్న విజయ్, సమంత.. నేడు విశ్వక్, నేహశెట్టి.. ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్..

టాలీవుడ్‌ విజయ్, సమంత ఒక కొత్త ట్రెండ్ కి స్టార్ట్ చేస్తే విశ్వక్ సేన్, నేహశెట్టి దానిని ముందుకు తీసుకు వెళ్తున్నారు. అయితే ఈ ట్రెండ్ ని కొందరు ఆడియన్స్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు.

Vishwak Sen Neha Shetty dance on stage after Vijay Devarakonda Samantha

Vishwak Sen – Neha Shetty : టాలీవుడ్ లోకి కొత్త ట్రెండ్ వచ్చిందట. ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్స్ అంతా దానినే ఫాలో అయ్యే పనిలో పడ్డారట. ఈ ట్రెండ్ ని విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత (Samantha) మొదలుపెడితే.. దానిని ఫాలో అవుతూ విశ్వక్ సేన్, నేహశెట్టి ముందుకు తీసుకు వెళ్తున్నారు. అయితే ఈ ట్రెండ్ ని కొందరు ఆడియన్స్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అసలు ఇదేమి ట్రెండ్ రా బాబు అంటూ నెట్టింట తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ట్రెండ్ ఏంటి..? ఆడియన్స్‌కి ఎందుకు నచ్చడం లేదు..?

RGV Vyooham : వ్యూహం టీజర్ చూసి ఆర్జీవీకి చంద్రబాబు ఫోన్.. వీడియో షేర్ చేసిన వర్మ.. నిజమేనా..?

నిన్న ‘ఖుషి’ (Kushi) మూవీ మ్యూజికల్ కాన్సర్ట్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ లో విజయ్ అండ్ సమంత కలిసి సినిమాలోని సాంగ్ కి డాన్స్ వేశారు. స్టేజి పై హీరోహీరోయిన్లు డాన్స్ వేయడంలో తప్పేముంది అని అంటారా..? అంటే ఈ డాన్స్ వేసే సమయంలో విజయ్ షర్ట్ తీసేసి మరి చేయడం, అలాగే డ్రెస్సింగ్ స్టైల్, కొన్ని మూమెంట్స్ ప్రేక్షకులకు ఇబ్బంది అనిపించాయట. ఈ విషయం పై నిన్నటి నుంచి విజయ్ అండ్ సామ్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ ట్రెండ్ మొదలయ్యి 24 గంటలు కూడా కాలేదు విశ్వక్ అప్పుడే ఫాలో అవ్వడం స్టార్ట్ చేసేశాడు.

Celebrity Look : అందాల భామల ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్.. వారసులతో స్టార్ హీరోల జెండా వందనం..

విశ్వక్, నేహశెట్టి కలిసి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలోని మొదటి సాంగ్ హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఈవెంట్ పెట్టి స్టూడెంట్స్ మధ్యలో రిలీజ్ చేశారు. అనంతరం ఆ సాంగ్ లోని ఒక డాన్స్ మూమెంట్ ని విశ్వక్, నేహా కలిసి స్టేజి పై వేశారు. ఈ స్టెప్పులో విశ్వక్, నేహా చీర కొంగుని తీసి తన ఒంటికి చుట్టుకుంటాడు. ఇక ఇది చూసిన కొంతమంది స్టూడెంట్స్ ముందు ఇలాంటి స్టెప్పులు ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు