RGV Vyooham : వ్యూహం టీజర్ చూసి ఆర్జీవీకి చంద్రబాబు ఫోన్.. వీడియో షేర్ చేసిన వర్మ.. నిజమేనా..?

వ్యూహం నుంచి రిలీజ్ అయిన సెకండ్ టీజర్ చూసి చంద్రబాబు, రామ్ గోపాల్ వర్మకి ఫోన్ చేశారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ వర్మ ఒక వీడియోని..

RGV Vyooham : వ్యూహం టీజర్ చూసి ఆర్జీవీకి చంద్రబాబు ఫోన్.. వీడియో షేర్ చేసిన వర్మ.. నిజమేనా..?

Chandrababu Naidu reaction on Ram Gopal Varma Vyooham movie teaser

Updated On : August 16, 2023 / 5:21 PM IST

RGV Vyooham : రామ్ గోపాల వర్మ (Ram Gopal Varma) ప్రస్తుతం ఏపీ (Andhra Pradesh) సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి పలు పోస్టర్స్ అండ్ ఒక టీజర్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ టీజర్ ని కూడా వర్మ రిలీజ్ చేశాడు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ని పూర్తి విలన్ గా చూపిస్తూ టీజర్ మొత్తం రన్ అయ్యింది.

Samantha : ‘చిన్మయి పాపా.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా..’ స‌మంత‌

ఇక ఈ టీజర్ చూసిన చంద్రబాబు.. ఆర్జీవీకి ఫోన్ చేశారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ వర్మ ఒక వీడియోని తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఏంటి నిజంగానే చంద్రబాబు ఫోన్ చేశారని అనుకుంటున్నారా..? లేదండోయ్..! ఇదంతా మన రామ్ గోపాల్ వర్మ మ్యాజిక్. గతంలో చంద్రబాబు, బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన సమయంలోని ఒక వీడియో క్లిప్ తీసుకోని.. దానికి చంద్రబాబు వాయిస్ లా డబ్బింగ్ చెప్పించి వర్మ రిలీజ్ చేశాడు. ఆ డబ్బింగ్ బాబు ఏమి చెప్పారంటే.. “మీ వ్యూహం టీజర్ చూశాను చాలా బాగుంది” అని వినిపిస్తుంది.

Celebrity Look : అందాల భామల ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్.. వారసులతో స్టార్ హీరోల జెండా వందనం..

ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. “ప్రమోషన్స్ ఎలా చేయాలో మిమ్మల్ని చూసే నేర్చుకోవాలండి బాబు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో జగన్ కుటుంబసభ్యులతో పాటు చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఇతర రాజకీయ నేతల పాత్రలు కూడా కనిపించబోతున్నాయి. వైస్ రాజశేఖర్ మరణం దగ్గర నుంచి సినిమా స్టార్ అయ్యి సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయడంతో మూవీ ఎండ్ అవ్వుతుంది. మొదటి భాగం వ్యూహం ఈ అక్టోబర్ లో, శపథం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి.